ED దాడుల్లో పట్టుబడ్డ వేల కోట్ల బంగారాన్ని… ఎక్కడ దాస్తారో తెలుసా..?

ED దాడుల్లో పట్టుబడ్డ వేల కోట్ల బంగారాన్ని… ఎక్కడ దాస్తారో తెలుసా..?

by Mohana Priya

Ads

తాజాగా వరుస దాడులతో వార్తల్లో నిలుస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate).బెంగాల్ మాజీ మంత్రి అయిన పార్థ చటర్జీ సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ వద్ద వారం రోజుల్లో బయటపడిన అక్రమార్జన అక్షరాల 50 కోట్ల నగదు ఐదు కిలోల బంగారం.

Video Advertisement

ED డిపార్ట్మెంట్ రైడు జరిపిన తరువాత రిలీజ్ చేసిన అర్పిత ఇంట్లో కుప్పలా పేర్చి ఉన్న నోట్ల కట్టల చిత్రాలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న డబ్బు బంగారం చూసిన అందరికీ కలిగే మొదటి ప్రశ్న ఇలా రైడ్ చేసి స్వాధీనం చేసుకున్న సొమ్ము ను గవర్నమెంట్ ఏం చేస్తుంది?.. ఈ డబ్బు ఎక్కడికి వెళ్లి చేరుతుంది?

money

ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలు ఇలాంటి రైడ్లను నిర్వహిస్తూ ఉంటాయి. మనీలాండరింగ్ కేసులు, ఆదాయప్పను ఎగవేత లేదా బ్లాక్ మనీ మొదలైన చర్యల్లో పాల్గొన్న వాళ్ళ స్థిర చరాస్తులను స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇలా స్వాధీనమైన మొత్తం సొత్తును కోర్టు ఆదేశాల మేర బాధితులకు తిరిగి ఇవ్వడం కానీ లేదా ప్రభుత్వానికి అప్పజెప్పడం గాని జరుగుతుంది. ఇది కనిపించినంత సులువు కాదు, దీని వెనక చాలా పెద్ద తతంగమే ఉంది, దానికి సంబంధించిన వివరాలు చూద్దాం.

# మొదట దాడి చేసి స్వాధీనం చేసుకున్న సొత్తును సీజ్ చేసిన అధికారులు దాని వివరాలు కోర్టుకు సమర్పిస్తారు.

# తదుపరి ఆ సొత్తు మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో జమ చేయబడుతుంది.

Reason began having lines on the currency note

# ఒక్కోసారి కొంత డబ్బుని అంతర్గత ఆర్డర్ల ద్వారా కేసు విచారణ పూర్తయ్యేంతవరకు హోల్డ్ లో పెట్టి పెడతారు.

# వెండి ,బంగారు ఆభరణాలు, వజ్రాలు ఇలాంటి విలువైన వస్తువులన్నీ జప్తు చేసిన తరువాత ప్రభుత్వ గోదాములో భద్రపరుస్తారు.

# విచారణ పూర్తి అయిన తర్వాత కోర్టు ఆదేశం ప్రకారం ఆస్తి గవర్నమెంట్ కు గాని లేదా సంబంధిత వ్యక్తికి గాని చెందుతుంది.

# చాలా కేసుల్లో కొంత జరిమానా విధించిన తర్వాత ఆస్తిని తిరిగి ఆ వ్యక్తికి లేక సంబంధిత సంస్థ కు అప్పగించడం జరిగింది.


End of Article

You may also like