Ads
కర్ణాటక లో ఇద్దరు మహిళా అధికారులు మధ్య జరిగిన ఫైట్ గురించి మీరూ వినే వుంటారు. అయితే రాజకీయ నాయకత్వాన్ని కూడా ఈ ఫైట్ కలవరపాటుకు గురి చేసింది. ఇక ఇంతకీ అసలు ఏం అయ్యింది..? వారి మధ్య గొడవ ఎందుకు..? బీబీసీ తెలుగు కథనం ప్రకారం, ఐపీఎస్ అధికారిణి, ఐఏఎస్ అధికారిణిపై తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలుని సోషల్ మీడియా లో చేయడమే కాదు ఆమె వృత్తిపరమైన విధానాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. వ్యక్తిగత ఫొటోలను కూడా పెట్టారు.
Video Advertisement
ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్ ఇది వరకు కూడా ఇలాంటి కొన్ని ఆరోపణలు చేసారు. దాంతో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (జైళ్ల) గా ఉన్న అధికారి రాజీనామా చేశారు.
ఇప్పుడు రోహిణి సింధూరిపై ఆరోపణలు చేస్తున్నారు. 2015లో ఈమె మాండ్య జిల్లా పరిషత్‌కు పని చేయాగా ఏడాది లోనే లక్ష మరుగుదొడ్లు నిర్మించారు. దానితో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవార్డు వచ్చింది. ఇవి తప్పుడు లెక్కలని ఐపీఎస్ రూపా మౌద్గిల్ ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. వీరి ఇద్దరికీ ఎలాంటి పోస్టింగ్ లేకుండా బదిలీ చేసింది.
ఇక అసలు ఏమైందనేది క్లుప్తంగా చూసేద్దాం.
అసలు గొడవ ఎందుకు మొదలైంది..?
- సింధూరి జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్.ఆర్. మహేశ్ ఇద్దఱు రెస్టారెంట్‌లో కలుసుకున్నారు. ఫోటోలు బయటపడడంతో గొడవ మొదలు అయ్యింది. అక్కడ వాళ్ళతో పాటుగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారీ ఉన్నారు.
- సింధూరికి, మహేశ్‌కి ఇది వరకే గొడవలు వున్నాయి. మైసూర్ డిప్యూటీ కమిషనర్‌గా సింధూరి వున్నప్పుడే తన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ని పెట్టించుకున్నారని మహేశ్ ఆరోపణలు చేయడం జరిగింది. అలానే మహేశ్ భూకబ్జాకు పాల్పడ్డారని సింధూరి అన్నారు.
- మరో పక్క మౌద్గిల్ ఈ ఫొటోలను చూసి ఇది రాజీ సమావేశం కాదు కదా అని అడిగారు. మాండ్యా, హసన్ జిల్లాల్లో సింధూరి పని చేసేటప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని మౌద్గిల్ చెప్పారు. అలానే లక్కీ అలీ తండ్రి కమెడియన్ మహమూద్ అలీ భూమి వివాదం లో సింధూరి మీద కొన్ని వ్యాఖ్యలు చేసారు.
- సింధూరి భర్త సుధీర్ రెడ్డి పెర్మిషన్ లేకుండా సర్వే చేశారని… తన భర్త కి సింధూరి సాయం చేస్తోందన్నారు.
ఐఏఎస్ అధికారిణి సింధూరి ఏం అంటున్నారు..?
- మౌద్గిల్ మానసిక సమస్యలతో బాధ పడుతున్నారని అన్నారు. దీన్ని కౌన్సిలింగ్, మందులు ద్వారా తగ్గించచ్చన్నారు. అధికారులు వారి మధ్యనున్న గోడలని ఇలా తీసుకు రాకూడదని కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు.
- అలానే రూపా మౌద్గిల్ తమ ఫోన్లను హ్యాక్ చేశారట. తన భార్య ఫొటోలను దారుణంగా వాడుతున్నారని రోహిణి సింధూరి భర్త సుధీర్ రెడ్డి పోలీసులకి ఫిర్యాదు చేశారు.
- మరి రూపా ఎవరు..? ఎవరికీ ఫొటోస్ ని పంపారు..? ఈ విషయానికి వస్తే.. దీని పై మేము మాట్లాడలేము మాకు తెలుసు అని అధికారులు చెప్పారు.
రూపా మౌద్గిల్ చేసిన ఆరోపణలు…
- ముగ్గురు, నలుగురు ఐఏఎస్ అధికారులకు రోహిణి సింధూరి అసభ్యకరమైన ఫొటోలు పంపించారు అని మౌద్గిల్ అన్నారు.
- అలానే ఐఏఎస్ ఆఫీసర్ డీకే రవి చనిపోవడానికి ముందు సింధూరితో చాట్ చేశారన్నారు.
లిమిట్ దాటి డీకే రవి సింధూరి తో చాట్ చేస్తే ఆమె అతన్ని ఎందుకు బ్లాక్ చెయ్యలేదు అని అన్నారు. - కరోనా టైం లో మైసూర్ నుంచి చామరాజనగర్ జనరల్ ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా గురించి కూడా ప్రశ్నించారు. ఆక్సిజన్ సరఫరా లోపించడం వలనే 24 మంది మృతి చెందారు అన్నారు.
రోహిణి సింధూరి ఏం చెబుతున్నారు…?
- రూపా వ్యతిరేకంగా ఉండాలనే ఇలా అంటున్నారన్నారు. ఆమె పెట్టె ప్రతీ పోస్ట్ కూడా అలానే ఉందన్నారు. మీడియా అట్రాక్షన్ కోసమే ఇదంతా అని అన్నారు.
- ఎప్పుడూ ఎవరో ఒకర్ని ఆమె టార్గెట్ చేస్తూ ఉంటుంది అని అన్నారు.
- అలానే ఫోటోలని ఉద్దేశిస్తూ .. అవి ఫొటోస్ కావని స్క్రీన్‌షాట్లని ఆమె అన్నారు.
- ఈ ఫొటోస్ ఎక్కడ తీసుకున్నానో మౌద్గిల్ చెప్పగలదా అన్నారు.
- ఈ ఫొటోలను ఎవరికీ పంపానో చెబితే.. అప్పుడు ఆమె బండారం బయట పడిపోతుందని చెప్పారు. ఆమె భర్త కూడా ఈ గొడవ పై మాట్లాడారు.
ఇద్దరికీ బదిలీ…..
మహిళా అధికారుల మధ్య వివాదం మూలంగా బొమ్మై సర్కార్ ఐపీఎస్ రూపా మౌద్గిల్, ఐఏఎస్ రోహిణి సింధూరిలను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
End of Article