“సుడిగాలి సుధీర్” పొరపాటు చేశారా..? ఇలా జరగడానికి కారణం అదేనా..?

“సుడిగాలి సుధీర్” పొరపాటు చేశారా..? ఇలా జరగడానికి కారణం అదేనా..?

by Megha Varna

Ads

సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్లుండరు. ప్రేక్షకులకి వివిధ షోల ద్వారా కనెక్ట్ అయ్యి పోయాడు సుడిగాలి సుధీర్. పైగా కామెడీ తో, నటన తో, ట్యాలెంట్ తో బుల్లి తెర పవర్ స్టార్ గా మారిపోయాడు. ఎప్పుడు ఏదో ఒక షో లో కనపడుతూ వుండే సుడిగాలి సుధీర్ ఈ మధ్యన కాస్త దూరం అయ్యిపోయాడు.

Video Advertisement

హాస్యాన్ని పండిస్తూ జబర్దస్త్ లో టీం లీడర్ గా కూడా వ్యవహరించాడు. మల్టీ టాలెంటెడ్ అయిన సుధీర్ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా సుధీర్ ని మెచ్చుకున్నారు.

కేవలం బుల్లితెరకే అంకింతం అయ్యి పోకుండా సుడిగాలి సుధీర్ వెండితెర లో కూడా అడుగు పెట్టాడు. వెండితెర లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు సుధీర్. ఫస్ట్ సుధీర్ చిన్న క్యారెక్టర్స్ చేసాడు.. తరవాత మంచి పాత్రలు కూడా వచ్చాయి. సాఫ్టువేర్ సుధీర్ సినిమాలో హీరోగా చేసాడు.

ఈ చిత్రం కూడా బాగా ప్రేక్షకులని మెప్పించింది. అలానే సుధీర్ జబర్దస్త్ తో పాటుగా ఢీ, శ్రీ దేవి డ్రామా కంపెనీ షో కి కూడా వచ్చేవాడు. కానీ ఈ మధ్య వీటిలో కూడా సుధీర్ కనపడడం లేదు. ఆ తరవాత సుధీర్ ఓ షో లో యాంకరింగ్ చేశాడు. ఇది ఈ మధ్య పూర్తి కావడం తో అక్కడ కూడా కనపడడం లేదు.

ఇక ఇది ఇలా ఉంటే ఓ మ్యూజిక్ షో లో వచ్చేవాడు సుధీర్. కానీ అది అయ్యాక ఇప్పుడు ఎక్కడ కనపడడం లేదు. అయితే ఇప్పుడు సుడిగాలి సుధీర్ జాడే లేదు. దాంతో చాలా మంది సుధీర్ జబర్దస్త్ వదిలేసి వెళ్లిపోవడం పొరపాటు ఏమో, ఒకవేళ షోలో ఉంటే సుధీర్ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉండేవారు అని అంటున్నారు. ఇప్పుడు కనిపించట్లేదు కాబట్టి అసలు సుదీర్ ఏమైపోయారు అని అని అనుకుంటున్నారు అని అంటున్నారు. మరి ఇప్పటి నుండి అయినా సుడిగాలి సుధీర్ ఏదైనా షో కి వస్తాడా..? లేదా అనేది చూడాలి. నిజంగా సుడిగాలి సుధీర్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు. సుడిగాలి సుధీర్ ఏదైనా షో కి వచ్చి ఎప్పటిలానే అలరిస్తాడో లేదా అనేది ఇప్పటికి ప్రస్నార్ధకమే.


End of Article

You may also like