Ads
ఇటీవల కాకినాడలో జరిగిన ఒక విషయం చర్చల్లో నిలిచింది. స్కూల్ లో జడ వేసుకురాలేదు అని ఒక టీచర్ స్టూడెంట్ జుట్టుని కత్తిరించారు. కేవలం ఒక్క స్టూడెంట్ మాత్రమే కాదు. ఒక ఎనిమిది మంది స్టూడెంట్ ల జుట్టుని టీచర్ కత్తిరించారు అని సమాచారం.
Video Advertisement
దాంతో అందరూ, “టీచర్ ది తప్పు. అసలు ఒక స్టూడెంట్ జుట్టు కత్తిరించే హక్కు టీచర్ కి లేదు” అని టీచర్ మీద కామెంట్స్ చేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా స్కూల్లో ఈ విషయంపై కంప్లైంట్ చేయడంతో టీచర్ ని ఈ విషయం మీద సస్పెండ్ చేశారు.
అయితే ఇప్పుడు ఈ విషయం మీద రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. నగరంలోని సర్వేపల్లి రాధాకృష్ణ నగరపాలక ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థినుల హెయిర్ స్టైల్ మీద ఉపాధ్యాయురాలు మంగాదేవి కొద్ది రోజుల నుండి హెచ్చరిస్తున్నారు. స్కూల్ కి వారు జడ వేసుకోకుండా హాజరు అవుతారు అని, అలా కాకుండా జడ వేసుకొని రావాలి అని మంగాదేవి రూల్ పెట్టారు. కానీ అలా చెప్పిన తర్వాతి రోజు కూడా ఆ విద్యార్థినులు జడ వేసుకోకుండా క్లిప్పులు పెట్టుకొని స్కూల్ కి హాజరు అయ్యారు.
దాంతో ఆగ్రహానికి గురి అయిన టీచర్ కొంత వరకు జుట్టుని కత్తిరించారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై స్పందించి మంగాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ విషయం సోషల్ మీడియా అంతటా కూడా స్పందించడంతో కొంతమంది మరొకరకంగా ఈ విషయానికి మరొక కోణం ఉంది అంటూ మరొక విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే, స్కూల్ అన్న తర్వాత రూల్స్ ఉంటాయి. అది సాధారణమే. ఇప్పుడే కాదు. చాలా సంవత్సరాల నుండి స్కూల్ కి ఎలా వెళ్లాలి అనే విషయంపై ఎన్నో స్కూల్స్ ఎన్నో రకమైన రూల్స్ పెడుతూ వచ్చారు.
కొంత మంది స్కూల్స్ లో పూలు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, పట్టీలు పెట్టుకోవడం, గొలుసులు వేసుకోవడం వంటివి ఉండకూడదు. అబ్బాయిలు అయితే యూనిఫారం నీట్ గా వేసుకోవాలి, ఇన్ షర్ట్ చేసుకోవాలి. జుట్టు క్రాఫ్ కూడా నీట్ గా ఉండాలి. ఎక్కువ జుట్టు ఉండకుండా నీట్ గా కటింగ్ చేసుకోవాలి అని కొన్ని రూల్స్ పెడతారు. అమ్మాయిలు అయితే, జుట్టు నీటుగా దువ్వుకొని, జడలు వేసుకుని, రిబ్బన్లు కట్టుకొని వెళ్ళాలి అని చెప్తారు.
ఒక వేళ ఇలా రానప్పుడు కారణం అడిగి తెలుసుకుని, ఒకటి రెండు సార్లు అయితే వదిలేస్తారు. అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే ఆ స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకుంటారు. దాంతో ఉపాధ్యాయురాలిని అనాల్సిన అవసరం లేదు అని, ఆమె జుట్టు కత్తిరించడం తప్పే అయినా కూడా, ఆమె రూల్స్ క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఆ విద్యార్థినులు అలా రాకూడదు కదా అని అంటున్నారు. మరి కొంత మంది అయితే ఆవిడ చేసింది ముమ్మాటికి తప్పే అని అంటున్నారు.
ALSO READ : సనాతన ధర్మం, హిందూ ధర్మం… ఈ రెండు ఒకటే అనుకుంటాం..! కానీ ఈ రెండింటి మధ్య ఇంత తేడా ఉందా..?
End of Article