“రాశి ఖన్నా” కి ఏమయ్యింది..? ఇలా మారిపోయారేంటి..?

“రాశి ఖన్నా” కి ఏమయ్యింది..? ఇలా మారిపోయారేంటి..?

by Harika

Ads

హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఆ తర్వాత తెలుగు సినిమాలు చేశారు హీరోయిన్ రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత యంగ్ హీరోస్ అందరితోనూ నటించారు. మొదటిలో రాశి ఖన్నా నటించిన సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాలు చేశారు. మధ్యలో కొన్నాళ్లు బ్రేక్ తీసుకొని, ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత మళ్లీ తొలిప్రేమ సినిమాలో నటించారు. అప్పుడు రాశి ఖన్నా నటించిన సినిమాలు అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఒకవేళ సినిమా ఫలితం ఆశించిన విధంగా లేకపోయినా కూడా రాశి ఖన్నాకి ఆమె చేసిన పాత్రలు మంచి పేరు తీసుకొచ్చాయి.

Video Advertisement

What happened to rashii Khanna

రాశి ఖన్నా తెలుగులో చివరిగా 2022 లో వచ్చిన థాంక్యూ సినిమాలో నటించారు. మళ్లీ అప్పటి నుండి తెలుగులో నటించలేదు. హిందీలో కొన్ని సినిమాలు చేశారు. తమిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు. కానీ తెలుగులో రాశి ఖన్నా సినిమా చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. ఈ క్రమంలో రాశి ఖన్నాలో మార్పు అందరూ గమనించారు. రాశి ఖన్నా ఒక సమయం వరకు హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అనే సూత్రాన్ని పాటించకుండా కాస్త హెల్తీగా (బొద్దుగా) ఉండేవారు. కానీ తర్వాత బరువు తగ్గారు. ఇప్పుడు ఇంకా బరువు తగ్గినట్టు తెలుస్తోంది. చాలా సన్నగా అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయారు. కొన్ని ఫొటోస్ లో చూస్తే అసలు వేరే హీరోయిన్ ని చూసినట్టు అనిపిస్తోంది. అంతలా మారిపోయారు.

What happened to rashii Khanna

ఇటీవల తన బాలీవుడ్ సినిమా యోధ ప్రమోషన్స్ లో భాగంగా రాశి ఖన్నా మళ్ళీ ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ సినిమా కోసం చాలా స్టైలిష్ గా రెడీ అయ్యారు. కానీ చాలా మారిపోయినట్టు అనిపిస్తున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో రెండు హిందీ సినిమాలు, ఒక తెలుగు సినిమా, ఒక తమిళ్ సినిమా ఉన్నాయి. నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న తెలుసు కదా సినిమాలో రాశి ఖన్నా నటిస్తున్నారు. ఇది తప్ప వేరే తెలుగు సినిమాలు సైన్ చేయలేదు. ఎందుకు అంటే, ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారు అని తెలుస్తోంది. మరి ఈ ఒక్క సినిమా కాకుండా నెక్స్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.


End of Article

You may also like