అసలు కెనడాలో ఏం జరుగుతుంది.? ఎందుకు ఇండియన్స్ ని జాగ్రత్తగా ఉండమంటున్నారు..?

అసలు కెనడాలో ఏం జరుగుతుంది.? ఎందుకు ఇండియన్స్ ని జాగ్రత్తగా ఉండమంటున్నారు..?

by kavitha

Ads

భారత్, కెనడా దేశాల మధ్య తలెత్తిన వివాదంతో కెనడాలో నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఇండియన్ పౌరులు మరియు ఇండియన్ స్టూడెంట్స్ ఎంతో మంది కెనడాలో నివసిస్తున్నారు.

Video Advertisement

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కెనడాలో ఉన్న భారత పౌరులు మరియు విద్యార్థులు, ప్రస్తుతం కెనడాకి వెళ్లాలనుకునే వారు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అసలు కెనడాలో ఏం జరుగుతుంది.? ఎందుకు ఇండియన్స్ ని జాగ్రత్తగా ఉండమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
భారత్ టెర్రరిస్ట్ గా ప్రకటించిన ఖలిస్తాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో ఒక గురుద్వార్  బయట హత్య చేయబడ్డాడు. ఇద్దరు వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్ పై కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే నిజ్జర్ ను ఇండియాకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీలే మర్డర్ చేశాయని, ఈ హత్య పై దర్యాప్తు జరపబోతున్నామని కెనడా పిఎం జస్టిన్ ట్రూడో ఇటీవల ప్రకటించారు.

ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కెనడాలో ఉన్న భారత రాయబారిని కెనడా, ఇండియాలో ఉన్న కెనడా రాయబారిని భారత్ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆర్డర్ వేశాయి. గురువారం నుంచి కెనడా దేశస్థులు ఇండియా రావడానికి వీసాల జారిని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.
మరోవైపు ఖలిస్థానీ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో నివసించే హిందువులు వెంటనే భారత్ కు వెళ్లిపోవాలని హెచ్చరికలు చేసింది. కెనడాలోని హిందువులకు ఒక అల్టిమేటంను కూడా జారీ చేసింది. బుధవారం నాడు రాత్రి కెనడాలో జరిగిన గ్యాంగ్ వార్ లో పంజాబ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా దునెకె చనిపోయాడు. ఈ నేపథ్యంలోనే కెనడా వీసాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: నిండా 6 సంవత్సరాలు… ఏం జరిగిందో కూడా తెలియదు..! కానీ ఇంతలోనే..?


End of Article

You may also like