Ads
మామూలుగా చనిపోయేముందు ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఉంటే అది ఎవరి పేరు మీద వెళ్ళాలి, తన ప్రాపర్టీ లు ఆస్తులు ఎవరికి చెందాలి ఇలాంటి విషయాలు ముందే నిర్ణయించుకుంటాం. అలాగే మీ ఎకౌంట్ కూడా ఎవరికి చెందాలో నిర్ణయించుకోవచ్చు.అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ అనుకుంటున్నారా ? కాదు. మీ ఫేస్ బుక్ అకౌంట్ . సోషల్ మీడియా అంటే మండిపడే వ్యక్తులకు ఇది వింటే కోపం రావచ్చు. కానీ నిజంగానే ఫేస్ బుక్ లో ఇలాంటి ఒక సదుపాయం ఉంది అని మీకు తెలుసా ?
Video Advertisement
చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఫేస్బుక్ అకౌంట్ ని ఎవరు హ్యాండిల్ చేయాలి అనేది ముందే నిర్ణయించుకోవచ్చు. ఫేస్ బుక్ లో ఉన్న లెగసీ కాంటాక్ట్ అన్న ఆప్షన్ ద్వారా ఒకవేళ చనిపోతే తర్వాత మీ ఫేస్బుక్ ఉంచాలా లేదా ఎవరికైనా అకౌంట్ ని ఆపరేట్ చేసే హక్కు ఇవ్వాలా? ఒకవేళ ఇవ్వాలి అంటే అది ఎవరికి? అనేది డిసైడ్ చెయ్యొచ్చు.కానీ ఒకవేళ వేరే వ్యక్తికి మీ అకౌంట్ ను ఆపరేట్ చేసే హక్కు ఇచ్చినా కూడా అది కొంతవరకే. అంటే వాళ్లు మీ అకౌంట్ లో లాగిన్ అవ్వలేరు. మీరు ముందు పెట్టిన పోస్ట్ లని డిలీట్ చేయలేరు. కేవలం ఫ్రెండ్ రిక్వెస్ట్ లు యాక్సెప్ట్ చేయడం, టైం లైన్ లో లో ఏదైనా పోస్ట్ చేయడం లాంటివి చేయొచ్చు. వ్యక్తి చనిపోయిన వెంటనే అకౌంట్ ప్రొఫైల్ నేమ్ రిమెంబరింగ్ అని మారిపోతుంది.
అలా రిమెంబరింగ్ అని కనిపించాలంటే లెగసీ కాంటాక్ట్ లో ఏ వ్యక్తి పేరైతే రాశారో, ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి అకౌంట్ లోని ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న అందరికీ మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. ఫేస్బుక్ ఓకే చేసిన తర్వాత టైం లైన్ మెమొరైజింగ్ టైం లైన్ గా మారిపోతుంది. ఆ వ్యక్తి పుట్టినరోజు, తను క్రియేట్ చేసిన ఇతర ఫేస్బుక్ పేజీలు, ఇంకా సజెషన్స్ లో ఆ వ్యక్తి పేరు కనిపించవు.సోషల్ మీడియా అనేది ఎంత ముఖ్యమైన పోయిందో ఇది చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఫేస్ బుక్ లాంటి వాటిలో ఎంతో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అకౌంట్ కి సరైన సెక్యూరిటీ లేకపోతే, కొంతమంది దాన్ని అలుసుగా తీసుకొని మీరు ఇబ్బంది పడేలా ఏమైనా పనులు చేసే అవకాశం ఉంది. అకౌంట్ హ్యాకింగ్ అనేది గత కొన్ని సంవత్సరాల నుండి మనం చూస్తూనే ఉన్నాం.ఎవరైనా తన అకౌంట్ ని వాడుతున్న అప్పుడే హ్యాక్ చేయడం, అందులో నుండి తప్పుడు పోస్టు వేయడం కామన్ అయిపోయింది. అలాంటిది మనం వాడనప్పుడు హ్యాకర్లు ఏవిధంగా మన పేరు ని మిస్యూజ్ చేయగలరో ఈపాటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు కూడా సెట్టింగ్స్ లోకి వెళ్లి మీ ఫేస్ బుక్ అకౌంటే కదా అని సులువుగా తీసుకోకుండా, ప్రైవసీ సెట్టింగ్స్ ని, ఇంకా లెగసీ సెట్టింగ్స్ ని మీకు తగినట్లు మార్చుకోండి.
Source: FACEBOOK
End of Article