Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ అంటే మొదట గుర్తొచ్చే ఒకే ఒక్క వ్యక్తి బ్రహ్మానందం గారు. ఆయన ఎక్స్ప్రెషన్స్ తో, కామెడీ టైమింగ్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో బ్రహ్మానందం గారి కామెడీ సినిమాకి ఒక మేజర్ హైలైట్ గా నిలిచింది. ఆయన కామెడీ వల్లే హిట్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.
Video Advertisement
ఫిబ్రవరి 1వ తేదీ 1956 లో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో జన్మించారు బ్రహ్మానందం గారు. సినిమాల్లోకి రాకముందు బ్రహ్మానందం గారు వెస్ట్ గోదావరి జిల్లాలోని అత్తిలిలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. 1987 లో జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన అహ నా పెళ్ళంట సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఆ సినిమాలో అరగుండు అనే పాత్రలో కోట శ్రీనివాస రావు గారితో కలిసి చేసిన కామెడీ, కోట శ్రీనివాసరావు గారి పాత్ర చేసే పనులకి ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మొదటి సినిమాతోనే బ్రహ్మానందం గారిని ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసింది. ఆ తర్వాత సత్యాగ్రహం, పసివాడి ప్రాణం, చంటబ్బాయి, చక్రవర్తి, స్వయంకృషి సినిమాల్లో నటించారు.
ఈ సినిమాల్లో కూడా బ్రహ్మానందం గారు పోషించిన పాత్రలకి చాలా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత దొంగకోళ్లు, చూపులు కలిసిన శుభవేళ, చిక్కడు దొరకడు, రుద్రవీణ, త్రినేత్రుడు, మరణ మృదంగం, రావు గారి ఇల్లు, స్వర్ణకమలం, పూలరంగడు, జూలకటక, కోకిల, హాయ్ హాయ్ నాయక, లంకేశ్వరుడు, రుద్రనేత్ర, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, బామ్మ మాట బంగారు బాట, శత్రువు, చెవిలో పువ్వు, జగదేకవీరుడు అతిలోకసుందరి, రాజా విక్రమార్క ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.
బ్రహ్మానందం గారు నటించిన సినిమాల లిస్ట్ చూస్తే అందులో ఎక్కువ సినిమాలు మెగాస్టార్ చిరంజీవితోనే ఉన్నాయి. దాంతో వాళ్ళిద్దరిదీ ఎంత హిట్ కాంబినేషనో అర్థమైపోతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన కృషికి జనవరి 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఎక్కువ సినిమాల్లో స్క్రీన్ క్రెడిట్స్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించారు బ్రహ్మానందం గారు.
మన్మధుడు సినిమాకి బెస్ట్ కమెడియన్ గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. మనీ, అనగనగా ఒక రోజు, వినోదం, రెడీ, రేస్ గుర్రం సినిమాలకి బెస్ట్ మేల్ కమెడియన్ గా, అన్న సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డులను అందుకున్నారు. బ్రహ్మానందం గారు పోషించిన పాత్రల్లో గుర్తుండిపోయే ఒక పాత్ర చెప్పమంటే చాలా కష్టం.
ఆయన నటించిన వాటిలో చాలా ఐకానిక్ రోల్స్ ఉన్నాయి. ఆ పాత్రలు, ఆయన వైపు నుంచే ఒక సినిమా తీయొచ్చు ఏమో అనే అంత హైలైట్ గా నిలిచాయి. ఒకవేళ నిజంగానే బ్రహ్మానందం గారు పోషించిన కొన్ని ఫేమస్ పాత్రల వైపు నుంచి కథ ఉంటే, ఆ టైటిల్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
#1 అదుర్స్ – బట్టు గాడి వీర ప్రేమ గాధ
#2 దుబాయ్ శీను – దుబాయ్ రాంకీ (ఫ్రెండ్ ఆఫ్ నాగలింగం)
#3 కృష్ణ – బాబీ బెల్ట్ ట్రీట్మెంట్
#4 నాయక్ – పెళ్లికాని జిలేబి
#5 కింగ్ – శంకరాభరణం
#6 లక్ష్మి – సత్తార్ సైడ్ కి రాడు
#7 వెంకీ – గజాల (సాఫ్ట్ వేర్ కాదు దొంగ)
#8 బాద్షా – I am the Fire
#9 ఢీ – చార్టెడ్ అకౌంటంట్ చారీ
#10 పోకిరి – లవర్ ఆఫ్ నటాషా
#11 మన్మధుడు – పాతికేళ్లుగా ప్యారిస్ లో
#12 రెడీ – మూర్తి THE CREATOR
#13 ఆంజనేయులు – జీనియస్
#14 నేనింతే – సినిమావాడు
#15 విక్రమార్కుడు – దొంగోడు
#16 బృందావనం – డాడీ
#17 మిస్టర్ పర్ఫెక్ట్ – వెరైటీ కిషోర్
#18 నమోవెంకటేశ – మోసగాడు
#19 దూకుడు – పద్మశ్రీ
#20 రేస్ గుర్రం – Kill Bill Pandey
#21 నువ్వు నాకు నచ్చావ్ – వీడికి షుగర్ ఎక్కువ
#22 కొంచెం ఇష్టం కొంచెం కష్టం – Jersey
End of Article