నా వల్ల కాదు.. అంటూ జబర్దస్త్ స్టేజి పైనే చెప్పేసిన సుధీర్.. ఆటో రామ్ ప్రసాద్ కూడా..? అసలేం జరుగుతోంది..?

నా వల్ల కాదు.. అంటూ జబర్దస్త్ స్టేజి పైనే చెప్పేసిన సుధీర్.. ఆటో రామ్ ప్రసాద్ కూడా..? అసలేం జరుగుతోంది..?

by Megha Varna

Ads

ఒకప్పుడు జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ రోజు రోజుకి తగ్గిపోతోంది. ప్రేక్షకులు కూడా జబర్దస్త్ షో ని బూతులు షో అని తిట్టి పోస్తున్నారు. దిక్కు లేకపోతే తప్ప ఎవరు జబర్దస్త్ చూడడం లేదు. పైగా మొదట్లో కంటే ఇప్పుడు కమెడియన్స్ తగ్గిపోయారు. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కొంతమంది కమెడియన్స్ వెళ్లిపోయిన సంగతి మనకి తెలిసిందే. ఆ తర్వాత అదిరే అభి కూడా రావడంలేదు. అతని స్కిట్స్ కూడా లేవు.

Video Advertisement

అలానే ఇప్పుడు చమ్మక్ చంద్ర కూడా నెమ్మదిగా సైడ్ అయిపోయాడు. ఇక జబర్దస్త్ లో హైపర్ ఆది, ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుధీర్ టీమ్ కాకుండా మిగిలిన స్కిట్స్ అన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. పైగా చూసే ప్రేక్షకులకు ఈ జబర్దస్త్ వల్ల చికాకు వచ్చేస్తోంది. గెటప్ సీను కూడా ఈ మధ్య పండగ షోలకు కానీ సుధీర్ టీమ్ స్కిట్స్ కి కానీ రావట్లేదు. ఇక జబర్దస్త్ లో ప్రస్తుతం ఆటో రాంప్రసాద్ వేసే చిన్న చిన్న పంచులు మాత్రమే పేలుతున్నాయి.

సుధీర్ అయితే పేరుకి మాత్రమే స్కిట్స్ చేస్తున్నాడు. ఇక జడ్జిగా రాణిస్తున్న రోజా విషయానికి వస్తే.. జడ్జిమెంట్ మాట పక్కన పెడితే రోజా కమెడియన్లు వేసే పంచులని ముందే చెప్పేస్తోంది. దీంతో ప్రేక్షకులకి చాలా డిస్ట్రబ్ గా ఉంటోంది. పైగా స్కిట్ కూడా బాగా దెబ్బ తింటోంది. తాజాగా సంక్రాంతి రోజున ప్రసారం కాబోయే ఒక స్కిట్ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో లో సుధీర్, రాంప్రసాద్ ని చూడొచ్చు.

అలానే రోజా ఎప్పటిలాగే ముందే పంచులని చెప్పేస్తోంది. ఎవరినీ డైలాగు కూడా చెప్పనివ్వట్లేదు. ఆ ప్రోమోలో మనం రాంప్రసాద్ ని డైలాగ్ చెప్పకుండా ఆపేయడం చూడొచ్చు. ఇదే సిచ్యువేషన్ నాలుగైదుసార్లు రాగా.. సుదీర్ ఇంక నావల్ల కాదనట్లు కింద కూర్చుండిపోయాడు. ఇక రామ్ ప్రసాద్ అయితే తన చేతిలో ఉన్న డ్రెస్ ని విసిరికొట్టాడు. ఈ మధ్య మనం కేవలం ఇలా స్కిట్స్ ని అడ్డుకోవడం మాత్రమే చూస్తున్నాము.


End of Article

You may also like