అసలు ఏంటి ఈ “స్టైరీన్” గ్యాస్.? మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.?

అసలు ఏంటి ఈ “స్టైరీన్” గ్యాస్.? మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.?

by Megha Varna

Ads

ప్రస్తుతం విశాఖలో గోపాలపట్నంలో మనిషిని తీవ్ర అస్వస్థతకు గురి చేస్తున్న విషవాయువు స్టైరిన్ .గురువారం తెల్లవారుజామున ఆర్ .ఆర్ వెంకటాపురంలో ఎల్ జి పోలీమర్స్ లో ఓ భారీ ప్రమాదం జరగడంతో స్టైరిన్ అనే గ్యాస్ లీక్ అయ్యింది .దీంతో ఈ విషవాయువు ను పీల్చిన ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.

Video Advertisement

9 మంది మృతి , దాదాపు 200 మందికి పైగా తీవ్ర అస్వస్థత

ఈ ప్రమాదంలో ఇప్పటికే తొమ్మిది మంది మృతి చెందగా దాదాపు 200 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు .అసలు ఈ స్టైరిన్ విషవాయువు అంటే ఏమిటి ,అసలు దీనిని ఎందుకు ఉపయోగిస్తారు ,ఈ విషవాయువు పీల్చగానే అది మనుషుల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ..వివరాల్లోకి వెళ్తే ..

స్టైరిన్ గ్యాస్ అంటే ఏంటి?

స్టైరిన్ ఇదొక అత్యంత ప్రమాదకరమైన విషవాయువు.ఇది ఒక పాలిమర్ .దీని కెమికల్ ఫార్ములా c6h5chch2 .దీని స్టైరిన్ అని వినైల్ బెంజీన్ అని కూడా పిలుస్తారు. బెంజీన్ ,ఎథిలిన్ రసాయనాల మిశ్రమంతో ఇది తయారవుతుంది.ద్రవ రూపంలో ఉండే దీనికి రంగు వాసనా అనేవి ఉండవు .ఈ వాయువు చాలా వేగంగా గాలిలో కలిసిపోతుంది .అంటే ఈ వాయువు గాలిలో కలిసిపోతే మనం సాధారణంగా ఊపిరితో పాటు తెలియకుండానే ఈ విష వాయువును పీల్చేస్తాం.ఈ విషవాయువు మన శరీరం మీద ప్రభావం చూపే వరుకు మనం ఆ స్టైరిన్ ను పీల్చాము  అనే విషయం కూడా మనకు తెలియదు .

ఈ విషవాయువును పీల్చితే ఏమవుతుంది?

ముఖ్యంగా మనం ఈ విషవాయువు పీల్చగానే  ఇది ముందుగా గొంతు ,ముక్కు దీని ప్రభావానికి ముందుగా లోనవుతాయి.ఆ తర్వాత నేరుగా దీని ప్రభావం మన నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది.తీవ్రంగా ఈ వాయువును పీల్చడం వలన కళ్ళు తిరగడం ,తల నొప్పి ,వాంతులు అవ్వడం ,అయోమయ స్థితికి లోనవడం ,తుమ్ములు ,నిలబడ లేకపోవడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి.అదే విధంగా ఊపిరితిత్తుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపి ఊపిరి ఆడని  పరిస్థితి కి కూడా లోనవుతారు.

 

స్టైరిన్ వాయువు ను ఎలా నిలువ ఉంచుతారు?

ఈ స్టైరిన్ వాయువు ను ద్రవ రూపంలో చాలా చల్లని పరిస్థితులలో నిల్వ చేస్తారు.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ఇది గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది .ఈ స్టైరిన్ ను ఎక్కువకాలం నిల్వ ఉంచితే పసుపు రంగులోకి మారుతుంది.ఈ వాయువు మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాగా ఇది గాలిలో అత్యంత వేగంగా కలిసిపోగలదు.దీనిని ప్లాస్టిక్ ,డిస్పోజబుల్ కంటైనర్ లు ,సింథటిక్ ,రబ్బర్ ల తయారీలో ఉపయోగిస్తారు.నిజానికి దాల్చిన చెక్క ,కాఫీ బీన్స్ ,వేరుశెనగలలో సహజంగానే ఈ స్టైరిన్ వాయువు ఉంటుంది .కానీ చాలా తక్కువ మోతాదులో ఈ స్టైరిన్ ఉంటుంది .మోటార్ వాహనాల పొగ మరియు సిగరెట్ కాల్చే పొగ నుండి కూడా ఈ స్టైరిన్ విడుదల అవుతుంది కానీ చాలా కొద్దిపాటి పరిమాణం కలిగి ఉంటుంది కానీ పొలిమెర్స్ నుండి రసాయనాల ద్వారా ఉత్త్పత్తి అయ్యే స్టైరిన్ ని పిలిస్తేనే అత్యంత ప్రమాదకరం.

స్టైరిన్ అత్యంత ప్రమాదకరం:

గ్లోబల్లీ హార్మోనైజిడ్ సిస్టం ప్రకారం ఈ స్టైరిన్ అత్యంత ప్రమాదకరం.ఈ స్టైరిన్ ను ఎక్కువగా పిలిస్తే హార్ట్ ,కిడ్నీ ,లివర్ ల మీదా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఈ వాయువు ముందుగా ద్రవ రూపంలో ఉంటుంది .. ఈ స్టైరిన్ చర్మం మీద పడితే దద్దుర్లు రావడం ,కంటి మీద పడితే తీవ్రంగా మంట రావడం జరుగుతుంది.ఈ స్టెరిన్ ను కొన్ని ఆయుధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

పబ్లిక్ హెల్త్ అఫ్ ఇంగ్లాండ్ ప్రకారం ఈ వాయువు ని పీల్చడం వలన హార్ట్ బీటింగ్ లో కూడా తీవ్రమైన తేడాలు వస్తాయని తెలిపింది.ఈ వాయువు పెద్దల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో పిల్లల మీద కూడా అదే ప్రభావం చూపిస్తుంది ..ఈ వాయువును ఎక్కువగా పీలుస్తూ ఉంటె కాన్సర్ కి గురయ్యే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ..


End of Article

You may also like