“హలో బ్రదర్” కంటే ముందే నాగార్జున డ్యూయల్ రోల్ నటించిన ఈ సినిమా గురించి తెలుసా..? మరో విశేషం ఏంటంటే?

“హలో బ్రదర్” కంటే ముందే నాగార్జున డ్యూయల్ రోల్ నటించిన ఈ సినిమా గురించి తెలుసా..? మరో విశేషం ఏంటంటే?

by kavitha

కింగ్ నాగార్జున ప్రస్తుతం రెట్టించిన ఉత్సాహంతో పనులు చేసుకుంటూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే, నాగార్జున కు ఈ ఏడాది విజయం దక్కలేదు. ఆయన నటించిన వైల్డ్ డాగ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మంచి పేరు తెచ్చుకుంది. కానీ.. ఎందుకనో ఈ సినిమా థియేటర్లలో మాత్రం ఆడలేదు. మరో వైపు బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తూ నాగార్జున బిజీ గా ఉంటున్నారు.

Video Advertisement

allari alludu 2

నాగార్జున కెరీర్ లో “హలో బ్రదర్” సినిమాని ఓ మైలురాయి గా చెప్పుకోవచ్చు. ఆయన డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా అప్పట్లో బాగా హిట్ అయింది. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన సినిమా ఏది అని అడగ్గానే ఎవరైనా “హలో బ్రదర్” అని టక్కున చెప్పేస్తారు. కానీ, ఈ సినిమా కంటే ముందుగానే నాగార్జున ఓ సినిమా లో డ్యూయల్ రోల్ చేసారు. ఆ సినిమా పేరే “‘అల్లరి అల్లుడు”. ఆక్టోబర్ 6 వ తేదికి ఈ సినిమా రిలీజ్ అయ్యి 28 ఏళ్ళు పూర్తి అయింది.

allari alludu 1

దర్శకుడు ఏ.కోదండ రామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టేసింది. ఈ సినిమాలో నాగార్జున సరసన నగ్మా, మీనా హీరో హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ ఉన్నట్లు చివరివరకు చూపించరు. లాస్ట్ లో క్లైమాక్స్ లో నాగార్జున కు ఒక తమ్ముడు ఉన్నట్లు.. మీనాను అతనికి ఇచ్చి పెళ్లి చేయనున్నట్లు చూపిస్తారు. ఈ సినిమాలో అత్త పాత్రలో వాణిశ్రీ నటించి మెప్పించారు. మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో అన్ని పాటలను వేటూరి గారే రచించారు.

 


You may also like