Ads
అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట ఎంతో ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. అయోధ్య అంత కూడా రామ నామ స్మరణతో నిండిపోయింది. హెలికాప్టర్ లో పూల వర్షం కురిపించారు.
Video Advertisement
భారతదేశమంతటా ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎంతో మంది ప్రముఖులని ఈ వేడుకకి ఆహ్వానించారు. రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు, సినీ ప్రముఖులు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీ నుండి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ వేడుకకి హాజరు అయ్యారు.
తమిళ ఇండస్ట్రీ నుండి రజినీకాంత్ వెళ్లారు. హిందీ ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు వెళ్లారు. క్రీడా రంగం నుండి సచిన్ టెండూల్కర్ తో పాటు, విరాట్ కోహ్లీ వంటి వారికి కూడా ఆహ్వానాలు అందాయి. సచిన్ టెండూల్కర్ ఈ వేడుకకి వెళ్లారు. అనిల్ కూంబ్లే కూడా అయోధ్యకి వెళ్లారు. అయితే, ఈ వేడుకకి హాజరు అయిన ప్రముఖులకి ఒక ప్రసాదం బాక్స్ ఇచ్చారు. అందులో 8 రకాల పదార్థాలు ఉన్నాయి. ఆ బాక్స్ లో ఏం ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఆ డబ్బాలో ఉన్న వస్తువులు ఇవే.
- యాలకుల గింజలు
- రాముడి ప్రమిద
- తులసి ఆకులు
- రక్ష తాడు (మౌలి కలవా)
- బెల్లంతో చేసిన రేవ్‌డీ
- పంజీరి ఘీ మావా లడ్డూ (గోధుమ పిండిని నేతిలో వేయించి, డ్రై ఫ్రూట్స్ వేసి, కోవా కలిపి తయారుచేసిన లడ్డూలు)
- రమదానా చిక్కి (రాజగిరతో తయారుచేసిన చిక్కిలు)
- కుంకుమ, అక్షింతలు
ఇవన్నీ కలిపి ఒక డబ్బాలో పెట్టి, రామ మందిరానికి విచ్చేసిన ప్రముఖులకు ఇచ్చారు. రామ మందిరం ప్రాణప్రతిష్ట కోసం తయారు చేసిన ఆహ్వాన పత్రికలు కూడా ఇంతే ఘనంగా రూపొందించారు. అందులో చాలా పదార్థాలను పెట్టి ప్రముఖులకి అందించారు. ఇప్పుడు తమ ఆహ్వానాన్ని స్వీకరించి శ్రీరాముడు దర్శనం కోసం విచ్చేసిన ప్రముఖులు అందరికీ కూడా ఇలాంటి డబ్బాలని అందజేశారు. ఎన్నో దశాబ్దాల కృషికి ఫలితం ఇది. కాబట్టి ఈరోజుని ఎంతో ఘనంగా జరిపేలా ముందు నుండి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యక్షంగా రాముడిని చూడలేని వారందరూ కూడా టీవీలో ప్రసారాన్ని చూసి ఆ శ్రీరాముడిని దర్శించుకున్నారు.
End of Article