Ads
ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, మెగాస్టార్ చిరంజీవి కోడలిగానే కాకుండా సోషల్ యాక్టివిటీస్ తో మంచిపేరు సంపాదించుకుంది. అపోలో హాస్పిటల్స్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఉపాసన చేసే సేవలు గురించి చాలామంది చెప్పుకుంటారు.
Video Advertisement
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఉపాసన రామ్ చరణ్ ఫోటోలను మాత్రమే కాకుండా తరచూ మంచి ఆరోగ్య చిట్కాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. డైట్ విషయంలో చాలా కేర్ తీసుకునే ఉపాసన డైట్ సీక్రెట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన జూన్ 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన చాలా ఏళ్ల తరువాత మెగాఫ్యామిలీలోకి వారసురాలు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాప వచ్చిన తరువాత జరిగే ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అయితే ఉపాసన సినిమాల విషయంలో తప్ప మిగితా విషయాల్లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మెప్పు పొందుతున్నారు. ముఖ్యంగా ఆమె ఆహారం మరియు ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, జాగ్రత్తలు తరచూ సోషల్ మీడియా లో షేర్ చేస్తూనే ఉంటారు. ఉపాసన ఫిట్‌నెస్, ఆరోగ్యానికి సంబంధించిన ‘బిపాజిటివ్’ అనే మ్యాగజైన్‌ను సైతం ప్రారంభించారు.
ఉపాసన డైట్ సీక్రెట్స్..
- ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటిలో తేనే, నిమ్మరసం కలిపి తాగుతారు.
- బ్రేక్ ఫస్ట్ కు ముందు 3 స్పూన్ కొబ్బరి నూనె కలిపిన బ్లాక్ కాఫీ తాగుతారు.
- బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్స్, స్ప్రౌట్స్, చికెన్ కర్రీ లేదా చేపల కూర తింటారు.
- లంచ్ లో రైస్ తో పాటు వెజ్ కర్రీస్ తీసుకుంటారు.
- బెండకాయ వేపుడు, పప్పు ఉపాసనకు ఇష్టమైన కూరలు.
- డిన్నర్ లో పెప్పర్ చల్లిన ఉడకబెట్టిన కూరగాయలు తీసుకుంటారు.
- రాత్రి 7 గంటలకు, అప్పుడప్పుడు 9 గంటలలోపే డిన్నర్ పూర్తి చేస్తారు.
- ప్రోటీన్స్ తో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటూనే, వ్యాయామం తప్పనిసరిగా చేస్తారు.Also Read: “రామ్ చరణ్-ఉపాసన” అంబిలికల్ కార్డ్ రక్తాన్ని ఎందుకు దాచారు..? దానికి ఎంత ఖర్చు అవుతుంది..?
End of Article