Ads
తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞాణంలోని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Video Advertisement
తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేస్తారంటూ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు.ఇప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సాధారణంగా గ్రహణం సమయంలో మాత్రమే మూసి వేస్తారు.
ఇది ఇలా ఉంటె…200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం గతంలో 1892 లో రెండు రోజులు మూసివేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అయితే అప్పుడు మూసివేయడానికి గల కారణాలు తెలీదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి కరోనాను నియంత్రించే కారణంగా మూసివేశారు.
End of Article