తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞాణంలోని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేస్తారంటూ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు.ఇప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా గ్రహణం సమయంలో మాత్రమే మూసి వేస్తారు.

ఇది ఇలా ఉంటె…200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం గతంలో 1892 లో రెండు రోజులు మూసివేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అయితే అప్పుడు మూసివేయడానికి గల కారణాలు తెలీదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి కరోనాను నియంత్రించే కారణంగా మూసివేశారు.

If you want to contribute content on our website, click here

Cryptoknowmics
Sharing is Caring:
No more articles