Ads
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త టీమ్‌పై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఆఫీసర్ల ఎంపిక పై దృష్టి సారించారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కీలక పోస్టుల్లో ఉన్న ఆఫీసర్ల స్థానచలనం ప్రారంభం అయ్యింది. త్వరలోనే ఐఏఎస్ మరియు ఐపీఎస్‌ల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Video Advertisement
ఆయా శాఖలకు సంబంధించి పలువురు ఆఫీసర్ల లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన పలువురు ఆఫీసర్లు అధికారికంగా కలుస్తుండగా, కీలక బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రిని కలవలేదు. ఆమె ఎక్కడా కనిపించడం లేదు. కారణం ఏమిటా అని ఆరా తీస్తున్నారు.బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కీలక బాధ్యతలలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక కార్యదర్శిగా చేశారు. ఆ బాధ్యతతో పాటు నీటిపారుదల శాఖ విధులు కూడా చూసుకున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించిన పనులు మరియు మిషన్ భగీరథకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. ఆమె ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహిస్తూ, ప్రాజెక్ట్ లను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తూ ముఖ్యమైన పాత్రను పోషించారు. రాష్ట్రంలో డైనమిక్ ఆఫీసర్ గా స్మితా సబర్వాల్‌కు పేరుగాంచారు.
కాంగ్రెస్ ప్రభత్వం వచ్చినప్పటి నుండి స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నుంచి పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయా శాఖల మినిస్టర్లను కలుస్తున్నారు. కానీ సీఎంఓకు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ అయితే కనిపించట్లేదు. నీటి పారుదల శాఖ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల పై మొదటిసారిగా నిర్వహించిన సమీక్షకు సైతం స్మితా సబర్వాల్ హాజరవ్వకపోటం హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సమీక్షలన్నింటిలో కనిపించటం, పలు ప్రాజెక్టుల విధులను కూడా పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం కనిపించకపోవడానికి కారణాలేంటా అని నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డితో సహా పలువురు నాయకులు బిఆర్ఎస్ గవర్నమెంట్ తో పాటు ఆఫీసర్ల పై అవినీతి చేసారంటూ ఆరోపణలు చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ల పేరుతో కోట్లు వెనుకేసుకుందంటూ ఆరోపణలు చేశారు. స్మితా సబర్వాల్ పైన కూడా కాంగ్రెస్ నాయకులు పలు సందర్భాల్లో అవినీతి ఆరోపణలు చేశారు. వాటి వల్లనే స్మితా సబర్వాల్ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలవట్లేదన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: ఫ్రీ బస్సు పెడితే అధికారం ఖాయమా… చూస్తుంటే అలానే ఉంది…!
End of Article