RRR Vs KGF 2..! ఈ 2 సినిమాలు హిట్టే..! కానీ “టాప్ ప్లేస్” లో నిలిచింది ఎవరు..?

RRR Vs KGF 2..! ఈ 2 సినిమాలు హిట్టే..! కానీ “టాప్ ప్లేస్” లో నిలిచింది ఎవరు..?

by kavitha

కరోనా కాలంలో ఓటీటీలకు అలవాటైన ప్రేక్షకులు ఆ తరువాత థియేటర్లలో చూడాడానికి  సినిమాలకు వస్తారా అనే ప్రశ్నలను, అనుమానాలను చెరిపేస్తూ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు 2022 బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్స్ సాధించి భారత సినిమా స్టామినాను పెంచాయి.

Video Advertisement

అయితే భారీ బ్లాక్ బస్టర్ లు అయిన కేజీఎఫ్ 2, RRR చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ లో  ఏ సినిమా టాప్ లో ఉంది. ఏ సినిమా తర్వాత అనేదానిపై ఇంకా ఊగిసలాట కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఆర్ ఆర్ ఆర్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ  ప్రశాంత్ నీల్,యశ్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ 2 మూవీ 1000 కోట్లకు పైగా రాబట్టింది. కేజీఎఫ్ 2 సినిమా ఇటు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ లో కూడా టాప్ ప్లేస్ లో నిలిచింది.
kgf-chapter-2-telugu addaకాగా ఇటీవల ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో రిలీజ్ అయ్యి, అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది. జపాన్ లో  RRR సినిమా రాబడుతున్న కలెక్షన్స్ తో  లెక్కలు మొత్తం మారిపోయాయి. ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా టాప్ ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జపాన్ లో RRR  రిలీజ్ కు ముందు వరకు కేజీఎఫ్ 2 సినిమానే 2022లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన సినిమాగా ఉంది.
RRR-telugu addaకానీ ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల వల్ల రాజమౌళి  సినిమాకి ఆ రికార్డు దక్కింది. అయితే ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ మూవీ  1200 కోట్ల కలెక్షన్స్ తెచ్చిందని తెలుస్తోంది. కాగా కేజీఎఫ్ 2 సినిమా  1200 కోట్లకు దగ్గరగా  ఉన్నట్లు సమాచారం. అయితే కొంచెం తేడాతోనే ఆర్ ఆర్ ఆర్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది.ఇక కేజీఎఫ్ 2 సినిమా రెండవ స్థానంలో ఉంది.


You may also like