తను చేసిన పాత్రల్లో… “అనుష్క” కి అస్సలు నచ్చని పాత్ర ఏదో తెలుసా..?

తను చేసిన పాత్రల్లో… “అనుష్క” కి అస్సలు నచ్చని పాత్ర ఏదో తెలుసా..?

by Mohana Priya

Ads

టాల్ బ్యూటీ, స్వీటి, దేవసేన, అరుంధతి, ఇలాంటి పేర్లతోనే ఆప్యాయంగా పిలుచుకుంటారు అనుష్క శెట్టి అభిమానులు. ఒక విధంగా తనను రాణి లాగానే భావిస్తారు. అనుష్క శెట్టి హీరోయిన్ కంటే ముందు, సర్టిఫైడ్ యోగ మాస్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.

Video Advertisement

అంతే కాదు తనకు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో చాలా స్పష్టంగా మాట్లాడగలదు. చాలా చురుకైన, అందమైన, సున్నిత మనస్తత్వం కలిగిన అనుష్క శెట్టి అంటే నచ్చని వారు ఉండరు. ఇంత ఫేమ, ఫ్యాన్ బెస్ ఉన్నా కూడా, చాలా ఉన్నతమైన ఆలోచన, డౌన్ టూ ఎర్త్ స్వభావంతో, అందరికీ చాలా దగ్గర మనిషి అయిపోతుంది అనుష్క శెట్టి.

అయితే ఇప్పటి వరకు తను చేసిన ప్రతీ సినిమాలో తన పాత్ర ఎంతో భిన్నంగా ఎంచుకుంటుంది. ఒకసారి అనుష్క నటించిన సినిమాల్లో తనకి నచ్చని పాత్ర ఏది అని అడిగితే, షాక్ ఇచ్చే ఆన్సర్ చెప్పింది. హీరోలకి ఏ మాత్రం తీసిపోకుండా తన కళను, ప్రతిభను చాటి చెప్తుంది. వుమెన్ ఓరియంటెడ్ మూవీస్ తియ్యడంతో… తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ప్రొఫెషనల్ గా ఎలాంటి ఛాలెంజ్ అయిన ఏదురుకుంటుంది.

ఎంత కష్టమైన పాత్రను అయినా అలవోకగా నటిస్తుంది. స్నేహం అంటే ప్రాణం ఇస్తుంది. తన చుట్టూ ఎవరికి ఏమి జరిగినా తన మనసు చలించిపోతుంది. తనకి నచ్చకపోయినా తన అనుకున్న వాళ్ళ కోసం ఏమైనా చెయ్యడానికి సిద్ధ పడుతుంది. ప్రభాస్ విషయంలో అదే జరిగింది.ఈ మేరకు అనుష్క శెట్టికి తను నటించిన పాత్రల్లో ఇష్టం లేకుండా చేసిన సినిమా బిల్లా అని వెల్లడించింది. అందులో తను చేసిన పాత్ర అంటే అసలు నచ్చలేదని, కేవలం ప్రభాస్ తో ఉన్న స్నేహం కోసం ఆ పాత్ర చెయ్యాల్సి వచ్చిందని తెలిపింది.

anushka did not liked this movie in her career

ఇది వినగానే అభిమానులు కొంత ఆశ్చర్యానికి గురైనా…అనుష్క శెట్టి కి స్నేహం అంటే ఎంత గౌరవమో కదా అంటూ మాట్లాడుకున్నారు. మరోవైపు అంతేగా రుద్రమదేవి, దేవసేన, అరుంధతి, భాగమతి లాంటి గొప్ప కథాంశాలతో సినిమాలు తీసే తనకి, అలా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని చేసే సినిమాలు ఎలా నచ్చుతాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీంతో అనుష్క పైన మరింత అభిమానం పెంచుకున్నారు.


End of Article

You may also like