ఎలాగోలా మందు పంపించు అంటే…డ్రోన్ తో పంపించాడు.! వైరల్ అవుతున్న వీడియో..!

ఎలాగోలా మందు పంపించు అంటే…డ్రోన్ తో పంపించాడు.! వైరల్ అవుతున్న వీడియో..!

by Megha Varna

Ads

కరోనా వలన మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నిటిలోను లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే .కొన్ని దేశాల్లో నిత్యావసరాలకు సంబందించిన షాపులు మినహా మిగతా షాపులు అన్ని మూతపడ్డాయి . మద్యం షాపులు కూడా మూతపడడంతో మందుబాబుల పరిస్థితి అధ్వరణంగా మారింది .రోజు మందు తాగే అలవాటు వున్నవారు ఒక్కసారిగా మద్యం దొరకకపోవడంతో తట్టుకోలేకపోతున్నారు ..మద్యం దొరకక ఫినాయిల్ తాగడం ఆత్మహత్యలు చేసుకోవడం మానసిక వైద్యశాలలో చేరడం మనం చూస్తూనే  ఉన్నాం .ఎటువంటి పరిస్థితులలో అయినా చుక్క పడితే గాని ఇంటికి వెళ్లని వారు ఇప్పుడు చాలాకాలం క్రితం నుండి చేసేది ఏమిలేక ఇంటికే పరిమితమవుతున్నారు ..

Video Advertisement

కానీ ఒకేసారి మద్యం మానేయడం వలన వారిలో మానసిక సమస్యలు తలెత్తి చుట్టూ ఉన్న వారిని తిట్టడం అనవసరంగా కోపపడం కొట్టడం లాంటివి చేస్తూ ఇంట్లో వారికీ తీవ్ర సమస్యగా మారారు ..కొంతమంది అయితే అకస్మాత్తుగా మద్యం తీసుకోకపోవడం వలన ఫిట్స్ బారిన పడి మరణిస్తున్నారు . మద్యం లేకపోవడం వలన కొందరిలో నిద్ర పట్టదని దాని వలన మానసిక సమస్యలు తలెత్తడం మామూలేనని మానసిక నిపుణులు చెప్తున్నారు ..ఈ నేపథ్యంలో మద్యానికి బానిస అయినా వారు మద్యం దొరకక ఎర్రగడ్డ హాస్పిటల్ లో చేరుతున్న కేసు లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి .

ప్రపంచంలో ఉన్న మందుబాబులది అందరిదీ ఇదే పరిస్థితి .ఆ కోవకే చెందారు ఆస్ట్రేలియా మందుబాబులు కూడా ..మందు దొరకక హోమ్ క్వారంటైన్ లో ఉంటూ  వింతగా ప్రవర్తిస్తున్నారు ..లాక్ డౌన్ లో వున్నారు బయటకు వెళ్ళడానికి లేదు ఇలాంటి సమయంలో మందుబాబులు తమ క్రియేటివిటీని చాటుకున్నారు…ఆ వివరాలేంటో చూద్దామా

మందు ఎలాగైనా తాగాలి అని ఎంతోకాలం నుండి ఎదురు చూస్తున్నారు ..మందు దొరకక పిచిక్కిపోతుంది .బాగా అలోచించి తన ఫ్రెండ్ ,డైరెక్టర్ జో మిగన్నో కు ఫోన్ చేసి మందు దొరకక చాల కష్టం గా ఉంది మన వాళ్లందరికీ మందు దొరకక పిచ్చెక్కిపోతుంది ..నువ్వే ఎదో రకంగా మందు పంపించాలని అభ్యర్దించాడు .

అయితే ఆ డైరెక్టర్ దగ్గర మందు బాటిల్ ఉంది కానీ బయటకు వచ్చి ఇవ్వడానికి లేదు ఎందుకంటే కరోనా వలన లాక్ డౌన్. బయట పోలీస్ లు ,వెళ్తే కరోనా వైరస్ వల్ల రిస్క్ .దాంతో బాగా ఆలోచించాడు ఎంతైనా డైరెక్టర్ కదా ఒక క్రియేటివ్ ఆలోచన వచ్చింది ..తన వద్ద వున్నా డ్రోన్ సహాయంతో రెండు గ్లాసులలో జానీ వాకర్ విస్కీ నింపి  తన ఇద్దరి మిత్రులకు పంపాడు ..దీనికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో యమా వైరల్ అవుతున్నాయి …దీనిపై నెటిజన్లు స్పందిస్తూ మంచి ఆలోచనే వచ్చింది డైరెక్టర్ కి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


End of Article

You may also like