Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పరిచయం అక్కర్లేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది. మధ్యలో ఎన్ని ఫ్లాప్స్ ఎదురైనా కూడా మళ్ళీ ధైర్యంగా ముందుకెళ్ళి కం బ్యాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ సంవత్సరం మొదట్లో వకీల్ సాబ్ సినిమాతో మనల్ని అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు భీమ్ల నాయక్ సినిమాతో మళ్లీ మన ముందుకు రాబోతున్నారు.
Video Advertisement
ఇందులో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా రీమేక్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్రను మలయాళంలో బిజు మీనన్ పోషించారు. మనకి టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో పవన్ కళ్యాణ్ కొంత మందిని కొడుతూ అరెస్ట్ చేయడానికి వెళ్లే సీన్ కనిపిస్తుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ పాత్ర నిజంగానే కోపంగా ఉన్నట్టు మనందరికీ తెలిసిపోతుంది.
అదే మలయాళంలో వేరే విధంగా చిత్రీకరించారు. ఇదే ఎమోషన్ ని బిజు మీనన్ ఇంకొక రకంగా చూపించారు. ఎవరి స్టైల్ లో వాళ్ళు, ఎవరి నేటివిటీకి తగ్గట్టుగా ఆ హీరో ఎమోషన్ కరెక్ట్ గా కన్వే చేశారు. అయితే, ఈ రెండు సీన్స్ కంపేర్ చేస్తూ ఎడిట్ చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. ఈ రెండు సీన్స్ చూశాక మీకు ఏమనిపించింది? ఇద్దరిలో ఎవరు బాగా చేశారు?
watch video :
https://youtu.be/6XLlsIJ424U
End of Article