Ads
ఒక ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన చిత్రాలను మిగతా భాషల్లో రీమేక్ చేయడం సర్వసాధారణం. అయితే తాజాగా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఓ చిత్రాన్ని హిందీలో చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించబోతున్నారట.
Video Advertisement
వివరాలలోకి వెళ్తే హీరో డామినేటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న రోజులలో చాలా గ్యాప్ తర్వాత తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డ్స్ ను అనుష్క తన పేరును నమోదు చేసుకుంది.అప్పటివరకు గ్లామర్ పాత్రలలో నటిస్తున్న అనుష్క కు.మంచి పాత్రలు రావడం మొదలయ్యాయి.ఆ ఒక్క చిత్రం అనుష్క కెరియర్ ను పూర్తిగా మార్చేసింది.ఆ చిత్రమే ” అరుంధతి “.
దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని బాలీవుడ్లో నిర్మించాలని అల్లు అర్జున్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో అనుష్క పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనే చేయబోతుందని ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఒక వార్త చక్కెర్లు కొడుతుంది. ఒకవేళ ఇది నిజమైతే తెలుగు ఇండస్ట్రీ దశదిశను మార్చిన ” అరుంధతి” మరి బాలీవుడ్ లో ఎన్ని మార్పులకు కారణమవుతుందో వేచి చూడాలి.
End of Article