Ads
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వెంటనే క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్వహించారు.
Video Advertisement
అయితే మంత్రులకు ఎవరికి ఏ శాఖ కేటాయించే దానిపైన ఇంకా స్పష్టత లేదు. అయితే జనం దృష్టి, మీడియా దృష్టి అంతా ఓకే శాఖ పైన పడింది. ఆ శాఖ ఎవరికి కేటాయిస్తారు అని ఎదురుచూస్తున్నారు. ఇంతకీ అది ఏ శాఖ అనుకుంటున్నారా…? ఐటీ శాఖ…
గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ శాఖను కేటీఆర్ నిర్వహించేవారు. గత రెండు టర్మ్ లలో కూడా కేటీఆర్ ఐటీ శాఖను అద్భుతంగా నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలబడ్డారు. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, ప్రతిభలో, ఐటీ శాఖ పై ఉన్న పట్టుతో హైదరాబాద్ కి MNC కంపెనీలు రావడంలో కేటీఆర్ కీలకపాత్ర ఉంది. ఈరోజు హైదరాబాద్ ఐటీ లో నెంబర్ వన్ రేంజ్ లో ఉందంటే దానికి ప్రధాన కారణం కేటీఆర్.
కేటీఆర్ కారణంగానే హైదరాబాదులో ఎక్కువ సీట్లు బిఆర్ఎస్ గెలుచుకుంది అనే వాదన కూడా ఉంది. అయితే కేటీఆర్ నిర్వహించిన ఐటీ శాఖను ఎవరికి కేటాయించిన కేటీఆర్ తో పోల్చడం తప్పనిసరి. కొత్త ప్రభుత్వంలో ఎవరికి ఈ శాఖ దక్కుతుంది అని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. ఎవరైనా సరే కేటీఆర్ నిర్వహించినంత సమర్థవంతంగా నిర్వహించగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, శ్రీధర్ రెడ్డికి కానీ ఐటీ శాఖ దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇంకా మంత్రి వర్గ విస్తరణ జరగాల్సి ఉండగా కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కల్వకుంట్ల మదన మోహన్ రావులకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇద్దరిలో ఎవరెవరికి ఐటీ శాఖ కేటాయించే అవకాశం లేకపోలేదు అనే వాదన కూడా ఉంది. మదన మోహన్ రావుకు ఐటి కంపెనీ నడిపిన అనుభవం ఉంది. యువకులకు మంత్రి పదవి కేటాయిస్తే సమర్ధవంతంగా నిర్వహిస్తారని హైదరాబాద్ యువత భావిస్తుంది. ఈ పదవి ఎవరికి దక్కెనో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే
End of Article