Ads
భారత ప్రజాస్వామ్యానికి ఇల్లు లాంటి చోటు లోక్ సభ…! పార్లమెంట్ పై దాడి జరిగి నేటికి 22 సంవత్సరాలు పూర్తయింది. సరిగ్గా ఇదే రోజు బుధవారం పార్లమెంట్ లో మరోసారి దుండగులు దాడి జరిగింది. ఈ విషయం ఇప్పుడు దేశమంతటా సంచలనం రేపుతుంది.
Video Advertisement
బుధవారం లోక్ సభ సమావేశాలు జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీ నుండి ఇద్దరు దుండగులు లోనికి చొచ్చుకు వెళ్లారు. ఒక వ్యక్తి స్మోక్ వదలగా, మరో వ్యక్తి ఎంపీల టేబుల్స్ వద్దకు వెళ్లి నల్ల చలాన్లు రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశాడు.
ఈ ఘటన వల్ల లోపల ఏం జరుగుతుందో అర్థం కాని ఎంపీలు పరుగులు తీశారు. కొందరైతే ధైర్యం చేసే ముందుకెళ్లి ఆ దుండగులను పట్టుకున్నారు. ఈ విషయంలో బిజెపి ఎంపీ ఆర్కే సింగ్ పటేల్ హీరోగా నిలిచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఒక వ్యక్తి భద్రతా సిబ్బందితో గొడవ పడడం తాను చూసానని వెంటనే వెళ్లి అతని మెడ పట్టుకోగా, మిగతా ఎంపీలు వచ్చి అతనిని చుట్టుముట్టారని చెప్పాడు. అతను తన వద్ద ఉన్న స్మోక్ డబ్బాతో కొట్టేందుకు ప్రయత్నించాడని చెప్పుకొచ్చారు.
ఆర్కే సింగ్ పటేల్ ఉత్తరప్రదేశ్ లోని బడా నియోజకవర్గ నుండి బిజెపి ఎంపీగా ప్రాతినీద్యం వహిస్తున్నారు. 2009, 2019లో ఎంపీగా గెలిచారు. దుండగులు లోపలికి చొరబడిన నేపథ్యంలో లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. ఈ ఘటనతో పార్లమెంటు కొత్త భవనంలో భద్రత వైఫల్యాలు బయట పడుతున్నాయి అంటూ పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : రేవంత్ రెడ్డిని కలిసిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు..? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?
End of Article