Ads
ఐపీఎల్ 2021 లో ఈ రోజు (14 ఏప్రిల్) సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మరియు రాయల్ చాలెంజర్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కెమెరా ఫోకస్ ఎక్కువగా ఆమె వైపే. ఇంతకీ ఆమె ఎవరు అని చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. కొంతమంది మనీష్ పాండే భార్య అని కూడా అనుకోని పొరపాటు పడ్డారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోండి.
Video Advertisement
అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ లో ఒకరు ఎప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ని సపోర్ట్ చేస్తూ కనిపిస్తారు. తను సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురట. తన పేరు కావ్య మారన్. కళానిధి మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జుట్టు కో ఓనర్. కావ్య కూడా సన్ మ్యూజిక్ తో పాటు సన్ టీవీ యొక్క ఇతర ఎఫ్ ఎం చానల్స్ వర్క్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారట. కావ్య తల్లి కావేరీ మారన్ సన్ గ్రూప్ కి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అట.
అంతేకాకుండా భారతదేశంలో హైయెస్ట్ పెయిడ్ బిజినెస్ ఉమెన్ అట. కావ్య కి క్రికెట్ అంటే చాలా ఇష్టమట. 2013 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ని సపోర్ట్ చేయడానికి కావ్య స్టేడియం కి వస్తున్నారట.
అంతకు ముందు డెక్కన్ ఛార్జర్స్ పేరుతో ఉన్న SRH జట్టు 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారింది. డెక్కన్ ఛార్జర్స్ గా ఉన్నప్పుడు మొదటి టైటిల్, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ గా మారిన తర్వాత రెండవ టైటిల్ ని గెలుచుకుంది.
End of Article