“సీతా రామం” సినిమాని రిజెక్ట్ చేసిన… ఆ యంగ్ తెలుగు హీరో ఎవరో తెలుసా..?

“సీతా రామం” సినిమాని రిజెక్ట్ చేసిన… ఆ యంగ్ తెలుగు హీరో ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

సాధారణంగా ఏదైనా సినిమా రిలీజ్ అయ్యాక చూసి నచ్చకపోతే వేరే సినిమాకి వెళుతుంటారు. అది కూడా నచ్చకపోతే మళ్ళీ వెరేదానికి వెళతారు. కానీ 2022 జూలై నెలలో విడులైన సినిమాలు ప్రేక్షకులకు ఒక్కటి కూడా హత్తుకోలేదు అనుకుంట… అందుకే ఒక్కటి కూడా హిట్ ఇవ్వలేక పోయాయి. అదేదో శని పట్టినట్టైంది ఆ సినిమా ప్రొడ్యూసర్లకి. తాము తీసిన సినిమాలకు అనుకున్నంత ఫలితం రాకపోవడంతో, ప్రొడ్యూసర్లకు, బయ్యర్లకు చెమటలు పట్టేస్తున్నాయి.

Video Advertisement

2022 జూలైలో రామారావు ఆన్ డ్యూటీ, థ్యాంక్ యూ, ది వారియర్, పక్కా కమర్షియల్, వంటి బడా హీరోల సినిమాలు విడుదల అయినప్పటికీ, అంతగా క్లిక్ అవ్వలేదు. దీంతో ఆయా సినిమా నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు అయ్యింది. కానీ సీతా రామం మాత్రం ఈ కోవకు చెందినది కాదు. కొత్త కొత్త కథలను పరీక్షకులు ఇష్టపడతారని నిరూపించింది.

sita ramam movie review

హీరో అయినా, హీరోయిన్ అయినా టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా… కథా అందులోని భిన్నత్వాన్ని ఇష్టపడుతున్నారు నేటి తరం ప్రేక్షకులు. గతంలో సూపర్ హిట్ ఇచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రజల దృష్టికి వచ్చాడు దుల్కర్ సల్మాన్. మహానటి తర్వాత నేరుగా తెలుగులో ఏ సినిమా చెయ్యక పోయినప్పటికీ, సీతా రామం సినిమాతో బాగా చేరువయ్యాడు. సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఈ పాత్రకు ముందుగా విజయ్ దేవరకొండని ప్రిఫర్ చేస్తే, డేట్స్ లేవని అయినా ఈ పాత్రను తాను సరిపోదని చెప్పాడంట విజయ్ దేవరకొండ.

vijay devarakonda

ఇటు అభిమానులు కూడా లెఫ్టినెంట్ పాత్రకు దుల్కర్ సల్మానే బాగా సెట్ అయ్యాడని అభిప్రాయపడుతున్నారు. దీంతో దుల్కర్ కి ముందు ముందు తెలుగు సినిమాల్లో అవకాశాలు మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక అదే సినిమాలో నటించిన మృణాల్ ఠాకూర్ కూడా తెలుగు సినిమాకు తొలి పరిచయం. ఒక ఇంటర్వ్యూలో కూడా తాను తెలుగు సినిమాల గురించి అభప్రాయాలు తెలిపారు. ఇటువంటి పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. దీంతో మృణాల్ కి కూడా, తెలుగు సినిమాల్లో మరిన్ని అవకాశాలు లభించబోతున్నట్టు కనిపిస్తోంది.


End of Article

You may also like