Home Filmy Adda Arjunreddy:విజయ్ దేవరకొండ కి నో చెప్పిన ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..?

Arjunreddy:విజయ్ దేవరకొండ కి నో చెప్పిన ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..?

by Sunku Sravan

విజయ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే .ఈ సినిమాలో విజయ్ తన రొమాంటిక్ నటనతో ఎంతోమంది హృదయాలను దోచుకున్నాడు.ఈ సినిమా లో షాలిని పాండే హీరోయిన్గా నటించగా వీరిద్దరి రొమాంటిక్ సన్నివేశాలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి.

paarvathy nair

మొదట ఈ సినిమా అవకాశాన్ని కొందరు హీరోయిన్స్ ఒదులుకున్నారు .ఈ సంగతి గతంలోనే దర్శకుడు సందీప్ వెల్లడించారు . రొమాంటిక్ మరియు ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండటం తోనే కొందరు నో చెప్పారు.అయితే వారిలో పార్వతి నాయర్ కూడా ఒకరు ఈ విషయాన్ని తానే స్వయం గా సోషల్ మీడియా వేదికగా ఒప్పుకున్నారు.

paarvathi nair
మలయాళం తో పాటు సౌత్ లోను ప్రస్తుతం బిజీ గా ఉంటూ మంచి క్రేజ్ ని దక్కించుకున్న పార్వతి నాయర్ సోషల్ మీడియా లో అభిమానులతో కాసేపు చిట్ చాట్ చేస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు .ఓ అభిమాని ,అర్జున్ రెడ్డి సినిమాకి మీరే నో చెప్పారా..? అని అడిగ్గా అందుకు సమాధానం ఇచ్చారు. అర్జున్ రెడ్డి ఒక మంచి సినిమా .రొమానిటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం తోనే ఆ సినిమా కి నో చెప్పినట్టు ఒప్పుకున్నారు. ఆ సినిమా ని చేయలేకపోయా అని బాధ పడను.మరో మంచి సినిమా ఆఫర్ వస్తుంది అని నమ్ముతాను అని కాసేపు అభిమానులతో ముచ్చటించారు.

You may also like