జబర్దస్త్ ప్రోగ్రాంలో “రోజా” స్థానంలో రాబోతున్న… ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరో తెలుసా..?

జబర్దస్త్ ప్రోగ్రాంలో “రోజా” స్థానంలో రాబోతున్న… ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరో తెలుసా..?

by Sunku Sravan

Ads

నటి, ఎమ్మెల్యే రోజా అంటే తెలుగు ఇండస్ట్రీతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆమె హీరోయిన్ గా చాలా సంవత్సరాలు తెరపై నటించి అగ్ర హీరోయిన్ లలో ఒకరిగా పేరు పొందారు. తర్వాత ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నగరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Video Advertisement

ఈ విధంగా పాలిటిక్స్ లో కూడా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఏ పార్టీలో ఉన్నా ఎదుటి వారిపై విరుచుకు పడే తీరు ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే ఆమె జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు.

దీంతో ఎంతో సంతోషంగా ఉన్నానని, ఇక నుంచి షూటింగులు మానేస్తున్నాను అని చెప్పారు.ఇకనుంచి సినిమా టీవీ షూటింగులు చేయలేకపోవచ్చు అని, జబర్దస్త్ షోలో కూడా పాల్గొననని మీడియా ముఖంగా చెప్పేసారు. మంత్రిగా నా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఆమె జబర్దస్త్ కు పులిస్టాప్ పెట్టడం వల్ల, మళ్ళీ ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది చాలా ఆసక్తిగా మారింది.

ఈ సందర్భంలో ఒక పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎగిరే పావురమా మూవీ తో పాటు ఇంకా మరిన్ని సినిమాల్లో నటించిన హీరోయిన్ లైలా ఇక నుంచి జబర్దస్త్ జడ్జి పాత్రలో కీలకంగా వ్యవహరించనున్నారు అని మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సంకేతాలిచ్చింది. ఇటీవల విడుదలైన టువంటి ఒక ప్రోమో లో రోజా తో పాటుగా నటి లైలా, ఆమని లకు కంటెస్టెంట్స్ చేసే స్కిట్ లకు ఏ విధంగా రిసీవ్ చేసుకుని, ఎలాంటి కామెంట్స్ ఇవ్వాలో, ఎలా ప్రోత్సహించాలి అనే వాటిపై ట్రైనింగ్ కూడా ఇచ్చారట.

ఇందులో విచిత్రమేమిటంటే ఈ ప్రోమో లో ఆమని నువ్వు జడ్జి గానే ఉన్నావు కదా మళ్లీ ఎందుకు అని రోజా అనగానే నేను బాగా చేస్తే లైలాని ఎందుకు పిలుస్తారు అని సమాధానం చెప్పింది. అంటే జబర్దస్త్ జడ్జిగా నెక్స్ట్ లైలా అనే కన్ఫామ్ ఐపోయింది. ఒకవేళ లైలా కాదంటే ఇంద్రజా లేదా ఆమని రోజా స్థానాన్ని ఆక్రమించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ చివరికి ఎవరిని ఇందులో తీసుకు వస్తారు అనేది త్వరలో క్లారిటీ రానుంది.

 


End of Article

You may also like