రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు….? చాణక్య స్ట్రాటజీ సర్వే…!

రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు….? చాణక్య స్ట్రాటజీ సర్వే…!

by Mounika Singaluri

Ads

ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే 2024 సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. అధికార వైసిపి ఇప్పటికే తమ అభ్యర్థులను మార్చే విషయం పైన దృష్టి సారించింది. నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను ప్రకటిస్తుంది. ఇక పొత్తులో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కసరత్తు పైన తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Video Advertisement

తెలుగుదేశం జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి అనేదానిపైన స్పష్టత లేదు. తమకు ఎమ్మెల్యే సీటు దక్కదని భావిస్తున్న ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది రాజీనామా చేసి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.

ఒకపక్క జనసేన పార్టీ కూడా చేరికలు ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందంటూ కూడా ఆంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్ధితి ఎలా ఉందన్న అంశాలపై ప్రజాభిప్రాయంతో చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్ధ తాజాగా సర్వే రిపోర్టు వెల్లడించింది. దీని ఫలితాలు ఏపీలో టీడీపీ-జనసేన కూటమి వల్ల భారీ ప్రయోజనం ఉండబోతున్నట్లు తేల్చాయి.

రాష్ట్రంలోని 175 సీట్లపై గత కొన్ని రోజులుగా తాము చేసిన సర్వే ఫలితాల్ని చాణక్య స్ట్రాటజీస్ ఇవాళ వెల్లడించింది. ఇందులో టీడీపీ-జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. అధికార వైసీపీ కేవలం 42 నుంచి 55 సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తంగా 18 సీట్లలోనే హోరాహోరీ పోరు ఉన్నట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కాకుండా ఇతరులకు 4 నుంచి 7 సీట్లు దక్కే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఈ సర్వే ఫలితాలు చూసిన టిడిపి జనసేన శ్రేణులు ఆనందంతో మునిగితేలుతున్నారు. మరోపక్క వైసీపీ శ్రేణులు ఈ సర్వే ఫలితాలను కొట్టి పడేస్తున్నారు

 


End of Article

You may also like