Ads
వాహనాల్లో దాదాపు ఎక్కువమంది వాడేవి టూ వీలర్స్. చిన్న సందు లో నుండి పెద్ద హైవే మీద వరకు ఎక్కడైనా సౌకర్యవంతంగా నడపవచ్చు. ఒకవేళ ఎక్కడికైనా వెళితే పార్కింగ్ ప్లేస్ లేకపోయినా కూడా ఎక్కడైనా అంటే మీరు వెళ్ళిన చోటకి దగ్గరలో సులభంగా పార్క్ చేయవచ్చు.
Video Advertisement
కానీ వర్షం వచ్చినప్పుడు లేదా ఎక్కువ వస్తువులు తీసుకువెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి అనుకోండి. అది వేరే విషయం. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ట్రాఫిక్ నుండి సులభంగా బయటికి రావాలి అంటే చాలామంది టు వీలర్ నే ఎంచుకుంటారు.
మీరు ఎప్పుడైనా గమనించారా టు వీలర్ కి యాక్సిలరేటర్ కుడి వైపు ఉంటుంది. ఈ విషయం కచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎందుకు అని ఆలోచించరా. యాక్సిలరేటర్ కుడి వైపు ఎందుకు ఉంటుంది? ఎడమవైపు ఉండొచ్చు కదా? అని అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా? అలా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే.
యాక్సిలరేటర్ కుడివైపు ఉండడానికి మొదటి కారణం ఏంటి అంటే దాదాపు చాలా మంది కుడిచేతి వాటం కలవారే ఉంటారు. ఎడమ చేతి వాటం కలిగి ఉన్నవారు కూడా యాక్సిరేటర్ ఆపరేట్ చేయడం లో అంత ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి కుడి చేత్తో సులభంగానే చేయగలుగుతారు.
ఇంకొక కారణం ఏంటి అంటే ఒకసారి మీరు బండిని గమనిస్తే దాదాపు ముఖ్యమైన భాగాలన్నీ ఎడమవైపు ఉంటాయి. అంటే కిక్ స్టాండ్, కిక్ స్టార్ట్, సెంటర్ స్టాండ్ అన్నమాట. ఇవన్నీ ఎడమవైపు ఉంటాయి. కాబట్టి బండి స్టార్ట్ చేసేటప్పుడు అంటే బండి స్టాండ్ తీసేటప్పుడు ఒత్తిడి అంతా ఎడమ వైపు పడుతుంది.
అటువంటి సమయంలో మనకి తెలియకుండానే ఎడమవైపు ఉన్న డమ్మీ హ్యాండ్ స్టాండ్ పై మన చేతి ఒత్తిడిని అప్లై చేస్తాం. అప్పుడు పొరపాటున యాక్సిలరేటర్ గనక ఎడమ వైపు ఉంటే బండి అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే రెండు వైపులా ఒత్తిడి సమానంగా ఉంది బండి బ్యాలెన్స్ అవ్వడానికి యాక్సిలరేటర్ కుడివైపు ఉండేలా టు వీలర్ వాహనాలను తయారు చేస్తారు.
End of Article