రీమేక్ సినిమాలకు “మహేష్ బాబు” దూరంగా ఉండడం వెనకున్న కారణం ఇదేనా.?

రీమేక్ సినిమాలకు “మహేష్ బాబు” దూరంగా ఉండడం వెనకున్న కారణం ఇదేనా.?

by Mohana Priya

Ads

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబుకి కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే మహేష్ బాబు ఇప్పటి వరకు వరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. ఎంతో మంది దర్శక నిర్మాతలు మహేష్ బాబుకి ఎన్నో సార్లు రీమేక్ సినిమాలో ఆఫర్ ఇచ్చారు.

Video Advertisement

7 mahesh babu

అయినా కూడా మహేష్ బాబు రీమేక్ సినిమాలని చేయను అని తిరస్కరించారు. అందులో శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన త్రీ ఇడియట్స్ రీమేక్ సినిమా స్నేహితుడు కూడా ఒకటి. స్నేహితుడు సినిమాని తెలుగులో మహేష్ తో తమిళంలో విజయ్ తో తీద్దామని అనుకున్నారట శంకర్. కానీ రీమేక్ సినిమా అవడంతో మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి తిరస్కరించారు.

16 mahesh babu

దాంతో ఈ సినిమాని తమిళంలో విజయ్ తో రూపొందించి తెలుగులో కూడా అదే సినిమాని డబ్ చేసారు. అయితే ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది మహేష్ బాబుని రీమేక్ సినిమాలు అంటే ఎందుకు ఆసక్తి ఉండదు అని అడిగారు. అందుకు మహేష్ బాబు చెప్పే సమాధానం ఒక్కటే. రీమేక్ సినిమాలు అంటే ఆల్రెడీ ఒరిజినల్ లో నటించిన హీరో ఇంపాక్ట్ ఉంటుంది.

కాబట్టి ఆ ఇంపాక్ట్ తో నేను నటించలేను. ఒకవేళ నేను నటించినా కానీ ఒరిజినల్ వెర్షన్ లో నటించిన హీరోనే మొదటి గా కనిపిస్తారు. కాబట్టి సెకండ్ ఇంపాక్ట్ తో నేను నటించలేను అని చెప్పారు. అంతే కాకుండా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన కత్తి సినిమా కూడా తెలుగు రీమేక్ లో నటించడానికి కూడా మహేష్ బాబుని సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి.

Why did Mahesh Babu stay away from remakes

కానీ కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 పేరుతో ఈ సినిమాని రీమేక్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో ఒక సినిమా, అలాగే త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నారు మహేష్ బాబు.


End of Article

You may also like