Home Featured చాలా మంది “సెలబ్రిటీలు” విడిపోవడానికి… ఈ 5 విషయాలే కారణం అవుతున్నాయా..?

చాలా మంది “సెలబ్రిటీలు” విడిపోవడానికి… ఈ 5 విషయాలే కారణం అవుతున్నాయా..?

by Mohana Priya

తమిళ్ స్టార్ హీరో ధనుష్, ధనుష్ భార్య ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా వారి విడిపోతున్నట్లు ప్రకటించారు. ఐశ్వర్య సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు వారిద్దరూ విడిపోదామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ వార్త చాలా మంది అభిమానులు షాక్ అయ్యేలా చేసింది. మామూలుగా వీరిద్దరికీ బెస్ట్ కపుల్ అని పేరు ఉంది.

అంతకుముందు ఐశ్వర్య కోసం ధనుష్ పాట పాడిన వీడియో కూడా చాలా వైరల్ అయ్యింది. అంత బాగా ఉన్నవాళ్లు సడన్ గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ చాలా మంది కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. వీరిద్దరు మాత్రమే కాకుండా, గత కొద్ది సంవత్సరాల నుండి ఇలా ఎంతో మంది సెలబ్రిటీ కపుల్స్ డివోర్స్ తీసుకుంటున్నారు. అసలు ఇలా సెలబ్రిటీ కపుల్స్ ఎక్కువగా విడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై స్కూప్ హూప్ అనే ఒక వెబ్‌సైట్ ఈ విధంగా రాశారు. అలా సెలబ్రిటీ కపుల్స్ విడిపోవడానికి కారణాలు ఏంటంటే.

#1 చాలా మంది తమకు తమ ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు. బయటికి ఆనందంగా కనిపిస్తూ, మేము హ్యాపీగా ఉన్నాం అని చూపించడంకంటే ఒకవేళ వైవాహిక జీవితం బాగోకపోతే విడిపోవడమే నయం అని అనుకుంటున్నారు. అలాగే కొన్నిసార్లు కెరీర్ కి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.

#2 విడిపోవడం అనేది వారి ఇష్టం. ఇది కేవలం ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది మాత్రమే. ఇందులో వేరే ఎవరూ కలగజేసుకొని వారిద్దరి నిర్ణయాలని మార్చే హక్కు లేదు.

heroines who divorced and never married

#3 ఒకవేళ ఒక జంటకి పిల్లలు ఉంటే, ఆ పిల్లల బాగు కోసం ఆ జంట కలిసి ఉంటే, అది చాలా సమస్యలకు దారి తీస్తుంది. బాధపడుతూ కలిసి ఉండటం కంటే, విడిపోయి సంతోషంగా ఉండడం నయం అనుకుంటున్నారు. దీనివల్ల పిల్లలకి కూడా చిన్నప్పటినుంచే ఇలాంటి విషయాలపై సర్దుకుపోకుండా నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యం అనేది తెలుస్తుంది. అలాగే హ్యాపీగా ఉండలేక, పిల్లల కోసం కలిసి ఉన్న జంట గొడవలు చూస్తే ఆ పిల్లల మానసిక పరిస్థితి కూడా బలహీనం అయ్యే అవకాశాలు ఉంటాయి.

what happened between dhanush and aishwarya before divorce

#4 కొంత మంది జంటలు భార్యాభర్తలుగా విడిపోయినా కూడా, స్నేహితులుగా కలిసి ఉంటారు. భార్యాభర్తలుగా వారిద్దరికీ కుదరదు అని అనుకున్నప్పుడు, కేవలం ఆ బంధం నుంచి మాత్రమే విడిపోతారు కానీ, వారు తరచుగా మాట్లాడుకోవడం వంటివి చేస్తూనే ఉంటారు.

why did many celebrities are getting divorced

#5 ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని అంటారు. చాలా మంది జంటలు ఇదే నిరూపించారు. అందులోనూ సెలబ్రిటీ కపుల్స్ చాలా మంది ఉన్నారు. కొంత మంది చిన్న వయసులోనే ఇదే ప్రేమ అనుకోని పెళ్లి చేసుకుంటారు. కానీ తర్వాత అది ప్రేమ కాదు అని వారికి అర్థమవుతుంది. అప్పుడు సర్దుకుపోయి కలిసి ఉండటంకంటే విడిపోవడం మంచిది అని అనుకొని, మాట్లాడుకొని విడిపోతారు.

why did many celebrities are getting divorced

ఆ తర్వాత ఆ జంటలో ఎవరో ఒకరికి కానీ, లేదా ఇద్దరికి కానీ వేరే వ్యక్తులతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతూ ఉండడం అనేది సహజం. ఒకవేళ ఇలా అయినా కూడా అది మంచిదే అని, ప్రేమకి నిజంగానే వయసుతో సంబంధం లేదు అని, ప్రేమ ఏ వయసులో ఉన్న వారికి అయినా కలగవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అందుకే సెలబ్రిటీలు కూడా ఇదే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

why did many celebrities are getting divorced

కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు. చాలా మంది ఇలాంటివి ఆలోచించి విడిపోతూ ఉంటారు.

You may also like