151 సీట్ల నుండి 11 సీట్లకి… 2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే.!

151 సీట్ల నుండి 11 సీట్లకి… 2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే.!

by Mohana Priya

Ads

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమిపాలు అయ్యింది. చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఎన్నో విషయాల గురించి ఈ సభలో చర్చించారు. కానీ ఏ ఒక్కటి కూడా ఫలించలేదు. ఇదే విషయం మీద ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అక్క చెల్లెళ్ల ఓట్లు ఏమయ్యాయో తెలియట్లేదు అని అన్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాలని కైవసం చేసుకున్న ఈ పార్టీ, ఈసారి కేవలం 11 స్థానాలకే పరిమితం అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అసలు అలా అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 నిరుద్యోగం

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం అధికంగా మారింది. జీతాలు పెంచుతాం అని చెప్పి జీతాలు పెంచలేదు. దాంతో చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఓట్లు తక్కువ అవ్వడానికి ఇది కూడా ఒక కారణం అని అంటున్నారు.

#2 కోవిడ్ లో స్కూల్స్

కోవిడ్ సమయంలో ప్రపంచమంతా ఆగిపోయింది. స్కూల్స్, కాలేజీలు నడవలేదు. ఆన్ లైన్ లోనే క్లాసులు నిర్వహించారు. అలాంటి పరిస్థితిలో కోవిడ్ సమయంలో కూడా స్కూల్స్ నిర్వహించాలి అని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా, బయోమెట్రీ రూపంలో స్కూల్ కి వచ్చే టీచర్ల అటెండెన్స్ కూడా తీసుకుంది. దాంతో గవర్నమెంట్ టీచర్స్ కూడా ఈ విషయం మీద నిరసన వ్యక్తం చేశారు.

#3 మూడు రాజధానులు

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా అమరావతిని తీసుకురావాలి అని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు అప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఆపేశారు. అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు తీసుకొస్తాను అని చెప్పారు. దాంతో అప్పటి వరకు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఈ విషయం మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు.

#4 పెద్దగా మార్పులు లేని మేనిఫెస్టో

2019 లో అమలు చేసిన మేనిఫెస్టోతో పోలిస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన మేనిఫెస్టోలో ఎక్కువగా మార్పులు లేవు. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినట్టు ఆంధ్రప్రదేశ్ వాసులు తమ అభిప్రాయాలని తెలిపారు. ఈసారి వాటిని పరిగణలోకి తీసుకొని కొత్త మానిఫెస్టోలో భారీగా మార్పులు చేస్తారు అని చాలా మంది ఆశించారు. కానీ అది జరగలేదు. మరొక పక్క కూటమి పార్టీ, గతంలో జగన్ ఇచ్చిన దాని కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇస్తాము అని హామీ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఈసారి అలా లేకపోవడంతో, ఎక్కువగా మారని హామీల వల్ల కూడా ఓట్లు తక్కువగా పడ్డాయి.

#5 చంద్రబాబు నాయుడు

గత సంవత్సరం చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లడం అనేది తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయడం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి బలంగా మారింది. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి రావడం అనే విషయం తెలుగుదేశం పార్టీ అనుచరులని కలచివేసింది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓట్లు తగ్గడానికి ఒక కారణం.

హామీలు ఇచ్చినా కూడా తర్వాత అమలు కాని విషయాలు. ఇలాంటి ఎన్నో అంశాలు ఉండడం కారణంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్లీ ప్రజలు కోరుకోలేదు. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు తక్కువగా వచ్చాయి.


End of Article

You may also like