Home Filmy Adda అబ్బా..! ప్రతి షోలో ఈ “రొమాన్స్” గోల ఏంటండీ..?

అబ్బా..! ప్రతి షోలో ఈ “రొమాన్స్” గోల ఏంటండీ..?

by Mohana Priya

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ షోస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎంటర్టైన్మెంట్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి టెలివిజన్ షోస్ చేసే మేకర్స్ కూడా కొత్త కొత్త కాన్సెప్ట్ లతో షోస్ తీసుకురావడం మొదలుపెట్టారు. కొన్ని డాన్స్ షోస్, కొన్ని గేమ్ షోస్, కొన్ని ఏమో కామెడీ షోస్ ఇలా రకరకాల షోస్ వస్తున్నాయి. అయితే, అన్నిట్లో మాత్రం ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. అదే రొమాన్స్.why makes are adding romantic track to tv shows

ఈ విషయం గురించి మాట్లాడుతుంటే మొదటిగా గుర్తొచ్చే జంట సుధీర్, రష్మీ. వీరిద్దరూ నిజ జీవితంలో చాలా మంచి స్నేహితులు అని అంటూ ఉంటారు. కానీ టీవీ విషయానికి వస్తే మాత్రం వీరిద్దరూ ప్రేమికులు అన్నట్టు చూపిస్తారు. ఏదైనా పండగ కి స్పెషల్ ఈవెంట్ చేసినప్పుడు అందులో సుధీర్ కోసం రష్మీ , లేదా రష్మీ కోసం సుధీర్  ఏదైనా పర్ఫామెన్స్ చేయడం, లేదా ఇద్దరూ కలిసి స్పెషల్ పర్ఫామెన్స్ చేయడం చాలా సార్లు జరిగింది.

వాళ్ళిద్దరి ప్రేమ ట్రాక్, షోలో చూపించిన ప్రతిసారి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఇదే తరహాలో ఇమాన్యుల్, వర్ష మీద కూడా అప్పుడప్పుడు ఒక లవ్ ట్రాక్ వస్తుంటుంది. ఇదే బాటని స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో కూడా అనుసరిస్తున్నారు. ఈ షోలో అషు రెడ్డి, హరిపై ఎక్కువ ఫోకస్ పెడతారు. ఈ వారంకి సంబంధించిన ప్రోమోలో కూడా వారిద్దరికీ సంబంధించిన ఒక సంఘటనని చూపించారు.

why makes are adding romantic track to tv shows

బిగ్ బాస్ ప్రోగ్రాంలో కూడా కంటెస్టెంట్స్ క్లోజ్ గా ఉండడం, వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతూనే ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఢీ ప్రోగ్రాంలో కూడా ఒక కంటెస్టెంట్, మరొక కంటెస్టెంట్ ని ఇష్టపడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే కామెడీ స్టార్స్ కి సంబంధించిన ఈ ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

watch video :

You may also like