Home Biography “డ్రమ్స్ శివమణి” ఎందుకు ఎప్పుడు తలకి బట్ట కట్టుకొని ఉంటారు.? వెనకున్న కారణం ఇదే.!

“డ్రమ్స్ శివమణి” ఎందుకు ఎప్పుడు తలకి బట్ట కట్టుకొని ఉంటారు.? వెనకున్న కారణం ఇదే.!

by Mohana Priya

ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉంటూ ఎన్నో పాటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు డ్రమ్మర్ శివమణి గారు. శివమణి గారి డ్రమ్స్ ఆ పాటకి ఒక స్పెషల్ టచ్ ఇస్తాయి. శివమణి గారు డ్రమ్స్ వాయించిన సూపర్ హిట్ పాటలు కొన్ని చెప్పడం అంటే చాలా కష్టం. లిస్ట్ స్టార్ట్ చేస్తే కొన్ని వందల పాటలు వరకు వస్తాయి.

why does drums sivamani covers his head

 

 

శివమణి గారు తెలుగు, తమిళ్, హిందీ ఇలా చాలా భాషల్లో ఎన్నో పాటలకు డ్రమ్స్ వాయించారు. శివమణి గారు తనకి ఏడు సంవత్సరాల వయసున్న అప్పటినుంచి డ్రమ్మింగ్ చేయడం మొదలుపెట్టారు. తనకి పదకొండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని మ్యూజికల్ కెరీర్ మొదలు పెట్టారు. శివమణి గారు పడమటి సంధ్యారాగం, సిరివెన్నెల అలాగే హిందీలో మదారి సినిమాల్లో కూడా నటించారు.

why does drums sivamani covers his head

శివమణి గారికి ఏ ఆర్ రెహమాన్ గారి తో కూడా చాలా మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇద్దరూ ఎన్నో సంవత్సరాలు కలిసి జర్నీ చేశారు. చేస్తున్నారు కూడా. అలాగే శివమణి గారి అబ్బాయి కుమరన్ శివమణి కూడా రెహమాన్ గారి దగ్గర పని చేస్తారు. అయితే శివమణి గారు తలకి ఎప్పుడూ ఒక క్లాత్ కట్టుకొని, ఒక డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారు.why does drums sivamani covers his head

అందుకు కారణం ఏంటి అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత 16వ రోజు ఆయన జుట్టు తీయాల్సి వచ్చింది అని. తర్వాత న్యూ యార్క్ కి వెళ్తే అక్కడ శివమణి గారి ఫ్రెండ్ జో ప్రభాకర్ శివమణి గారికి బందనా కొనిచ్చారు అని, తర్వాత శివమణి గారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కలెక్ట్ చేశారు అని, అది ఆయనకి సూట్ అయ్యింది అని, అందరూ ఆయనని గుర్తుపట్టడం మొదలు పెట్టారు అని అందుకని అలాగే కంటిన్యూ చేశారు అని చెప్పారు.

why does drums sivamani covers his head

watch video :

You may also like