ఆ రెండు యాప్స్ తొలగించడానికి అసలు కారణం చెప్పిన “గూగుల్”.

ఆ రెండు యాప్స్ తొలగించడానికి అసలు కారణం చెప్పిన “గూగుల్”.

by Mohana Priya

Ads

భారతీయ ఆప్ డెవలపర్‌లకు ఈ వారం మొత్తం ఎంతో విచిత్రంగా ఉంది. మొదట భారతదేశంలో tik tok రేటింగ్ పడిపోవడంతో గూగుల్ సహాయంతో మళ్లీ మామూలు రేటింగ్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు టిక్ టాక్ లానే భారతదేశం కోసం తయారు చేసిన ఆప్ మిత్రోన్ , అలాగే మన ఫోన్లలో ఉండే చైనా ఆప్ లని తీసేసే రిమూవ్ చైనా ఆప్స్ అనే ఆప్ కూడా ప్లే స్టోర్ నుండి తొలగించి వేయబడింది.

Video Advertisement

ఈ సంఘటన ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ గూగుల్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. దాంట్లో ప్రత్యేకించి ఈ ఆప్ ల పేర్లు చెప్పకపోయినా, వాళ్ళు వీటి గురించే మాట్లాడుతున్నారు అని మనమే అర్థం చేసుకునేలా ఆ నోట్ ఉంది. మిత్రోన్ గురించి మాట్లాడుతూ ” ఈ వీడియో ఆప్ కొన్ని టెక్నికల్ ప్రైవసీ రూల్స్ ని వ్యతిరేకించింది. మేము డెవలపర్లు సహాయంతో ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాము. పరిష్కారమైన వెంటనే మళ్ళీ గూగుల్ స్టోర్ లో తిరిగి విడుదల చేస్తాం”.

ఈ ఆప్ పాకిస్తాన్ నుండి తీసుకున్నారు అని. కంటెంట్ ఏమీ మార్చకుండా అలానే విడుదల చేయడం వల్ల కాపీరైట్ సమస్య వచ్చింది. అందుకే అప్ ని ప్లే స్టోర్ లో నుండి తీసేయాల్సి వచ్చింది అని చెప్పారు. రిమూవ్ చైనా ఆప్స్ గురించి మాట్లాడుతూ ” ఇది మనిషి ఫోన్ లో ఉన్న మొత్తం వివరాలు చూస్తుంది. ఇంకా మన ప్రమేయం లేకుండానే మన ఫోన్ లో ఉన్న వేరే ఆప్స్  ని తీసేస్తుంది. ఇది ఒక రకంగా డివైస్ ని ఓనర్ కాకుండా వేరే ఒకరు ఉపయోగించడం అవుతుంది. మన ఫోన్ ని మూడవ పార్టీ ఉపయోగించటం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి డెసెప్టివ్ డివైస్ సెట్టింగ్ చేంజెస్ పాలసీ కింద ఈ యాప్ ను తొలగించాల్సి వచ్చింది.

ఒక ఆప్ వేరే ఆప్ లని మార్చడం, లేదా తొలగించడం లాంటివి ప్రోత్సహించాల్సిన విషయాలు కాదు. దీనివల్ల డెవలపర్ల కి, ఇంకా వినియోగదారులకి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఇలాంటి ఎన్నో ఆప్ లని ప్లే స్టోర్ లో నుండి తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చేశాం” అని చెప్పారు.


End of Article

You may also like