Home Filmy Adda గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి కారణం అతనా…!

గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి కారణం అతనా…!

by Sainath Gopi

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు నిర్మాతలు పూర్తి చేశారు. ఇప్పటికే సినిమాని అత్యంత భారీ లెవెల్లో రెండు తెలుగు రాష్ట్రాళ్లతో పాటు, ఓవర్సీస్ లో కూడా విడుదల చేయడానికి థియేటర్లను కూడా బుక్ చేశారు. అయితే ఈ సినిమాకి భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈనెల ఆరో తారీఖున హైదరాబాదులో యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ జరపాలని ప్రయత్నించారు. అయితే ఉన్నట్టుండి ఈవెంట్ ని ఆపేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. పర్మిషన్ అందకపోవడమే దీనికి కారణంగా తెలుస్తుంది.

guntur kaaram fan theories

అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది నిరాశగా మిగిలింది. పర్మిషన్ కోసం సినిమా టీం విశ్వ ప్రయత్నాలు చేసినా దక్కకపోవడం అనేది ఆశ్చర్యపరిచే విషయమే. అసలు ఎందుకు పరిమిషన్స్ ఇవ్వలేదు అనే విషయం తెలియదు కానీ ఏప్రిల్ వరకు హైదరాబాదులో బహిరంగ సభలు జరగవనేది మాత్రం స్పష్టమవుతుంది. చేసుకోవాలంటే కేవలం ఇండోర్ స్టేడియంలో మాత్రమే చేసుకోవాలని చెబుతున్నారు.

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా ఇప్పుడు ట్రైలర్ కూడా డైరెక్ట్ సోషల్ మీడియాలో విడుదల చేసేసారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా మీద అమాంతం అంచనాలను పెంచేసింది.అయితే మేకర్స్ మాత్రం ఈ వేడుక గుంటూరులో జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈనెల తొమ్మిదో తారీఖున ఈవెంట్ ఉండనున్నట్లుగా చెబుతున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది సినిమా టీం నుండి. రావాలి.

You may also like