HANUMAN OTT: “హనుమాన్” ఓటీటీ తెలుగులో ఆ సీన్స్ కట్ చేసారా.? మరి నిడివి ఎందుకు తగ్గింది?

HANUMAN OTT: “హనుమాన్” ఓటీటీ తెలుగులో ఆ సీన్స్ కట్ చేసారా.? మరి నిడివి ఎందుకు తగ్గింది?

by Harika

Ads

2024 సంక్రాంతికి భారీ సినిమాల తో పోటీపడి అఖండ విజయాన్ని సాధించిన చిన్న సినిమా హనుమాన్. అవ్వటానికి చిన్న సినిమాయే అయినా 400 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాలన్నీ ఇప్పటికే ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యాయి కానీ హనుమాన్ మాత్రం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వలేదు. రికార్డు స్థాయిలో వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ పై చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Video Advertisement

అయితే ఈ నెల 17న ఈ సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్లో రిలీజ్ అవ్వటానికి టైం పడుతుందని అంతా అనుకున్నారు కానీ ఈనెల 17న తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ఓటీటీ లో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమా హిందీ వర్షన్ కి తెలుగు వర్షన్ కి టైం మ్యాచ్ అవ్వకపోవటంతో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

అసలు ఏం జరిగిందంటే, సినిమా థియేటర్లో రన్ టైం కంటే ఓటీటీ లో 8 నిమిషాల నిడివి తక్కువగా ఉంది. హిందీ వర్షన్ లో మాత్రం థియేటర్ రన్ టైం తో మ్యాచ్ అవుతుంది. హిందీ వెర్షన్ లో 2:38 నిమిషాలు రన్ టైం ఉంటే తెలుగులో మాత్రం 2: 30 నిమిషాలు మాత్రమే రన్ టైం ఉంటుంది. తెలుగులో సినిమాని ఎనిమిది నిమిషాలు కట్ చేసేసారని అపోహ పడ్డారుప్రేక్షకులు. అయితే తగ్గింది రన్ టైమే కానీ సినిమాలో ఏమాత్రం సీన్స్ కట్ చేయలేదు.

కేవలం తెలుగు వర్షన్ మైక్రో సెకండ్ల తేడాతో కొంచెం వేగంగా రన్ అవటంతో 8 నిమిషాలు తేడా వచ్చింది, అంతేకానీ సినిమాలో ఎలాంటి సీన్స్ కట్ అవలేదు. ఇక సినిమా విషయానికి వస్తే థియేటర్లో సినిమాని ఎంతగా ఎంజాయ్ చేశారో అంత ఎగ్జైటింగ్ గానే ఓటీటీ లో కూడా సినిమా చూస్తున్నారు ప్రేక్షకులు. ఓటీటీ లో కూడా ఈ సినిమా రికార్డుల వర్షం కురిపించేలా ఉంది.


End of Article

You may also like