RCB vs MI: సూపర్ ఓవర్ లో ఫార్మ్ లో ఉన్న “ఇషాన్ కిసాన్” బ్యాటింగ్ ఎందుకు చేయలేదు?

RCB vs MI: సూపర్ ఓవర్ లో ఫార్మ్ లో ఉన్న “ఇషాన్ కిసాన్” బ్యాటింగ్ ఎందుకు చేయలేదు?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 లో నిన్న ముంబై ఇండియన్స్ జట్టుకి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ ఓడిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్: 24 బంతుల్లో 4×4, 4×6), అరోన్ ఫించ్ (52: 35 బంతుల్లో 7×4, 1×6), దేవ్‌దత్ పడిక్కల్ (54: 40 బంతుల్లో 5×4, 2×6) స్కోర్ చేశారు. దాంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

Video Advertisement

తర్వాత ఇషాన్ కిషన్ (99: 58 బంతుల్లో 2×4, 9×6), కీరన్ పొలార్డ్ (60: 24 బంతుల్లో 3×4, 5×6) స్కోర్ చేశారు. దాంతో ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇద్దరికీ టై అవ్వడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. నిన్న మ్యాచ్ లో బాగా ఆడిన వాళ్ళలో ఇషాన్ కిషన్ ఒకరు. కానీ సూపర్ ఓవర్ లో ఇషాన్ కిషన్ ఆడలేదు.

సూపర్ ఓవర్ లాంటి ముఖ్యమైన టైంలో అంత బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్ ఆడకపోవడం ఏంటి? అనే ప్రశ్న అందరిలో నెలకొంది.  ఈ విషయంపై రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇషాన్ కిషన్ చాలా అలసిపోయి ఉన్నారు అని, అందుకే సూపర్ ఓవర్ కోసం ఆడడానికి సిద్ధంగా (ఫ్రెష్ గా)  లేరు (Kishan was drained and not fresh to go out again for the Super over) అని అన్నారు. ఏదేమైనా నిన్నటి మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఆట తీరు ని చూసిన వాళ్ళందరూ ఇషాన్ కిషన్ ని ప్రశంసిస్తున్నారు.


End of Article

You may also like