Ads
తెలుగు సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్ లో నటించే నటీనటుల అందరూ దాదాపు ప్రతి తెలుగువారి కుటుంబంలో ఒక భాగమైపోయారు. హీరో, హీరోయిన్లే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్ లో చాలా బాగా నటిస్తారు. అందుకే ఈ సీరియల్ లో నటించే చిన్న పిల్లలకి కూడా దాదాపు హీరోహీరోయిన్ల కి ఉన్నంత పాపులారిటీ ఉంది.
Video Advertisement
అయితే ప్రస్తుతం సీరియల్ లో మళ్ళీ పాత నటీనటులను తీసుకువచ్చి ఫ్లాష్ బ్యాక్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ గతం మర్చిపోవడం, దాంతో దీప మళ్లీ కార్తీక్ కి గతం గుర్తు చేయాలని ప్రయత్నిస్తూ ఉండటం ఇదంతా జరుగుతూనే ఉంది. సీరియల్ అంటే చాలా క్రేజ్ ఉంది. కానీ అలా అని ఏది పడితే అది తీస్తే ఎలా చూస్తాం అంటూ చాలా కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని ఎపిసోడ్స్ అయితే అసలు సీరియల్ ఎటు పోతుందో కూడా అర్థం అవ్వట్లేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మరొక ఎపిసోడ్ పై కూడా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఇవాళ వచ్చే ఎపిసోడ్ లో కార్తీక్ తాగి ఉన్నప్పుడు దీప కార్తీక్ దగ్గర కూర్చొని తాను కూడా తన డాక్టర్ బాబుతో కలిసి తాగి ఇలా చేశాను అంటూ చెప్తూ ఉంటుంది. ఇదంతా విన్న కార్తీక్ పడి పడి నవ్వుతాడు. ఇది ఇవాళ ఎపిసోడ్ లో వచ్చే సీన్. ఈ ఎపిసోడ్ పై మళ్లీ కామెంట్స్ రావడం మొదలయ్యాయి.
“అసలు ఏం చేస్తున్నారో వీళ్ళకి అయినా అర్థం అవుతుందా? సీరియల్ ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్ళింది? ముందు లీప్ అన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ల కథ కూడా ముందుకు వెళ్ళింది. వాళ్లకి కూడా హీరోలు ఉన్నారు. అంత దూరం వచ్చిన తర్వాత మళ్లీ దీప ఎంట్రీ చూపించారు. తర్వాత అసలు ఫ్లాష్ బ్యాక్ అంటూ పాత నటీనటుల అందరినీ మళ్లీ తీసుకువచ్చి, పెద్దవాళ్ళు అయిన పిల్లల్ని మళ్లీ పిల్లలు చేసేసి వేరే కథ నడిపిస్తున్నారు. ఇప్పుడేమో ఇలాంటి సీన్స్ పెడుతున్నారు. అసలు సీరియల్ కాన్సెప్ట్ ఏంటి? మీరు చేస్తోంది ఏంటి?” అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
End of Article