కార్తీకదీపం సీరియల్ లో శ్రావ్య ఎందుకు మారిందో తెలుసా?

కార్తీకదీపం సీరియల్ లో శ్రావ్య ఎందుకు మారిందో తెలుసా?

by Megha Varna

Ads

ప్రస్తుతం బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ కార్తీకదీపం జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. ఎంతలా అంటే ఆ టైంలో పక్క ఛానల్ లో కొత్త సినిమాలు వేస్తున్నా వాటిని ఎవరూ చూడట్లేదు. అంతగా మన అందరికీ కనెక్ట్ అయిన ఈ కార్తీకదీపం సీరియల్ లో లేటెస్ట్ గా శ్రావ్య పాత్రలో ఒక కొత్త నటి చేస్తున్నారు. ఈ సీరియల్ అభిమానులను మొదటినుండి నటిస్తున్న శ్రావ్య ఉన్నట్టుండి ఎందుకు మారిపోయింది అనే డౌట్ ఇప్పుడు బాగా ఇబ్బంది పెట్టేస్తుంది.

Video Advertisement

అలాంటి వారు ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.అలాగే మీకు తెలిసిన కార్తీకదీపం సీరియల్ ఫ్యాన్స్ తో దీన్ని షేర్ చేసుకోండి.ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం.మొదట దీప అంటే పడని శ్రావ్య ఇప్పుడు దీప,కార్తీక్ కలవాలని కోరుకుంటుంది.ఈ పాత్రలో ఉన్న వేరియేషన్స్ ను మొదటి నుండి బాగా పండిస్తున్న అమ్మాయి పేరు సంగీత కమల్. ఫిల్మీ ఫోకస్ కథనం ప్రకారం …లాక్ డౌన్ అనంతరం మూవీలు,సీరియల్ షూటింగ్ లు అన్నీ ఒకేసారి ప్రారంభం కావడంతో తన డేట్స్ క్లాష్ కావడంతో కార్తీకదీపం సీరియల్ షూటింగ్ కు రాలేకపోయారనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలీదు.

ఈ క్రమంలో సీరియల్ లో భారీ మార్పును చూసి…కొంత మంది ఫేక్ న్యూస్ కూడా రాసారు. “ఆమెకు కరోనా సోకి ఉంటుందని…అందుకే ఆమెను సీరియల్ నుండి తీసేసారు” అనే ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఆమె బాగున్నారు అని క్లారిటీ ఇచ్చారు. ఆమె సీరియల్ లో కన్పించకపోవడానికి కచ్చితమైన కారణం ఏంటో తెలీదు. బహుశా బిజీ షెడ్యూల్ వల్లే అని వార్త కూడా వైరల్ అవుతుంది.

దీనితో షూటింగ్ ఆపలేక నీహారిక అనే కొత్త అమ్మాయిని ఈ పాత్రలో కొనసాగిస్తున్నారు అంట. మరి ఈమెను టెంపరరీగా శ్రావ్య పాత్రలో పెట్టారా? లేక పర్మినెంట్ గా పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. సీరియల్ అభిమానులు మాత్రం ఎందుకు క్యారెక్టర్ ని చేంజ్ చేసారా అనే డౌట్ లో ఉన్నారు.


End of Article

You may also like