అంత బాగా ఆడుతున్నా రాహుల్ ని ఎందుకు టెస్ట్ లోకి సెలెక్ట్ చేయలేదు? కారణాలు ఇవేనా?

అంత బాగా ఆడుతున్నా రాహుల్ ని ఎందుకు టెస్ట్ లోకి సెలెక్ట్ చేయలేదు? కారణాలు ఇవేనా?

by Megha Varna

Ads

న్యూజిలాండ్ పర్యటనలో తన సత్తా చాటిన రాహుల్ ని మనం ఎంత పొగిడినా తక్కువే అనుకోండి. ఐసీసీ టీ20 ర్యాంకుల్లో టాప్ 2 కి చేరుకున్నాడు. టాప్ ప్లేస్‌లో ఉన్న బాబ‌ర్ ఆజ‌మ్ (పాకిస్థాన్) కంటే త‌ను కేవ‌లం 56 పాయింట్ల వెనుకంజ‌లో ఉన్నాడు. అయితే అంత మంచి దూకుడు మీదున్న రాహుల్ ని న్యూజిలాండ్ తో జరిగే టెస్ట్ మ్యాచ్ లో సెలెక్ట్ చేయలేదు.

Video Advertisement

భారత టెస్టు జట్టు వివరాలు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌, నవదీప్‌ సైని, శుభ్‌మన్‌ గిల్‌, అజింక్య రహానే, హనుమ విహారి, ఛెతేశ్వర్‌ పుజారా, వృద్ధిమాన్‌ సాహా, రిషబ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ. ఇషాంత్‌ శర్మకు కూడా జట్టులో అవకాశం లభించింది. అంతేకాకుండా యువపేసర్‌ నవదీప్‌ సైని, యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీషాకు కూడా జట్టులో చోటు దక్కింది. చివరి టీ20లో గాయపడిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ స్థానంలో వన్డే సిరీస్‌కు మయాంక్‌ అగర్వాల్‌కు అవకాశం ఇచ్చారు.

అయితే రాహుల్ కి మాత్రం నిరాశే మిగిలింది. అలా జరగడానికి కారణాలు ఇవి అయ్యుండచ్చు. గతంలో టెస్ట్ లో ఫామ్ కోల్పోయారు రాహుల్. ఆ తరువాత కోలుకోడానికి చాలా కాలం పట్టింది. దాని ప్రభావం వన్ డే, టీ 20 మీద కూడా పడింది. ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న అతనికి టెస్ట్ లో ఏదైనా తేడా జరిగితే త్వరలో ఉన్న టీ 20 ప్రపంచ కప్ లో ఇబ్బంది అవుతుంది. అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అనే ఆలోచనతో రాహుల్ ని తీసుకోలేదు అనుకుంట. పైగా టెస్ట్ లో రాహుల్ యావరేజ్ అంతంత మాత్రంగానే ఉంది.

అది కాక రాహుల్ కి ఇప్పుడు రెస్ట్ అవసరం అని భావించి సెలెక్ట్ చేసుండక పోవచ్చు. కొత్త వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వొచ్చు అని అనుకోని ఉంటారు. పైగా మయాంక్‌ అగర్వాల్‌,అజింక్య రహానే గత టెస్ట్ మ్యాచుల్లో తమ సత్తా చాటారు.


End of Article

You may also like