దీపక్ హూడా 50 కొట్టడంతో కృనాల్ పాండ్య ని ఎందుకు ట్రోల్ చేసారు.? ఇద్దరి మధ్య గొడవేంటి.?

దీపక్ హూడా 50 కొట్టడంతో కృనాల్ పాండ్య ని ఎందుకు ట్రోల్ చేసారు.? ఇద్దరి మధ్య గొడవేంటి.?

by Mohana Priya

Ads

ఏప్రిల్ 12 వ తేదీన రాజస్థాన్ రాయల్స్ జట్టు తో పంజాబ్ కింగ్స్ కు జరిగిన ఐపీఎల్ 2021 మ్యాచ్ లో 228.57 స్ట్రైక్ రేట్ తో 6 సిక్సర్లు మరియు 4 ఫోర్లతో సహా 28 బంతుల్లో 64 పరుగుల స్కోరు చేశారు దీపక్ హూడా. ఇది దీపక్ కి మొదటి ఐపీఎల్ 50 .

Video Advertisement

trolls on krunal pandya

ఈ మ్యాచ్ లో దీపక్ కేవలం 20 బాల్స్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. అందులో ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ లలో ఒకటిగా ఇది నిలిచింది. ఫాస్ట్ గా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ లలో ఒకరిగా దీపక్ నిలిచారు.

trolls on krunal pandya

అయితే దీపక్ హుడా ఆడుతున్నంతసేపు కృనాల్ పాండ్యా పేరు ట్రెండింగ్‌లో కనిపించింది. అదేంటి…ఇద్దరికీ సంబంధం ఏంటి అని చాలామందికి డౌట్ వచ్చింది.  జనవరిలో సయ్యద్ ముస్తాక్ ఆలీ 2021 టోర్నీ సమయంలో కృనాల్ పాండ్యా తో జరిగిన ఒక గొడవ కారణంగా బరోడా క్రికెట్ అసోసియేషన్ దీపక్ హుడా ని ఆ డొమెస్టిక్ సీజన్ నుండి తొలగించింది. అప్పుడు బరోడా జట్టుకి కెప్టెన్ కృనాల్, వైస్ కెప్టెన్ దీపక్ ఉన్నారు. ఆ గొడవ కారణంగా ఆరంభానికి ముందురోజు అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు దీపక్ హుడా

ఈ విషయంపై దీపక్ మాట్లాడుతూ, “ఈ సమయంలో నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను. ఒత్తిడికి గురయ్యాను. గత కొన్ని రోజుల నుండి, ముఖ్యంగా గత రెండు రోజుల నుండి నా జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యా అందరి ముందు నాపై అబ్యుసివ్ లాంగ్వేజ్ ఉపయోగించారు. అక్కడ వడోదర లోని రిలయన్స్ స్టేడియం లో మ్యాచ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వేరే రాష్ట్రాలకు చెందిన టీమ్స్ కూడా ఉన్నారు. నేను బరోడాలో ఎలా ఆడతాను అని అతను నన్ను భయపెట్టారు. నేను ఇప్పటి వరకు నా క్రికెట్ కెరియర్ లో ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఎప్పుడూ చూడలేదు” అని అన్నారు.

trolls on krunal pandya

ఇప్పుడు ఐపీఎల్ లో పంజాబ్ టీంలో దీపక్ హుడా ఆటతీరు కి ఇంప్రెస్ అయిన నెటిజన్లు కృనాల్ పాండ్యా ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

trolls on krunal pandya trolls on krunal pandya trolls on krunal pandya trolls on krunal pandya


End of Article

You may also like