Home Filmy Adda ఈ కారణంతోనే “మహేష్ బాబు”… జనగణమన నుండి తప్పుకున్నారా..? ఈ నిర్ణయం సరైనదేనా..?

ఈ కారణంతోనే “మహేష్ బాబు”… జనగణమన నుండి తప్పుకున్నారా..? ఈ నిర్ణయం సరైనదేనా..?

by Mohana Priya

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో సినిమా ప్రకటించారు. ఈ సినిమా పేరు జనగణమన. ఈ సినిమా 2023 లో విడుదల అవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండ మిలటరీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తారు అని సమాచారం.

ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబు నటించాల్సి ఉంది. ఆ పోస్టర్ కూడా ఎప్పుడో విడుదల చేశారు. కానీ ఈ సినిమా ఆగిపోయింది.

ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఈ సినిమా ప్రకటించారు. “అసలు మహేష్ చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండ ఎందుకు చేస్తున్నారు?” అనే ప్రశ్నలకు ఉంది. “మహేష్ బాబు ఈ సినిమా నుండి తప్పుకోవడానికి కారణం ఏంటి?” అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ సినిమా మిలిటరీ నేపథ్యంలో సాగుతుంది. అలాగే సినిమా సబ్జెక్ట్ కూడా రిస్కీగా అనిపించింది. ఈ కారణంగానే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు అని సమాచారం. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల అవుతుంది.

why mahesh babu opted out from jana gana mana

అలాగే పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతుంది. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఒక ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మైక్ టైసన్ కూడా ఈ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారు.

You may also like