“ఖుషి” సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక హీరోయిన్ గా సమంత నటిస్తోందని తెలిసి ఈ సినిమా గురించిన వార్తలు ఎక్కువగా వచ్చాయి. అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు సమంత ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూసారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. కొంత పాజిటివ్ టాక్, కొంత నెగటివ్ టాక్ తో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.

Video Advertisement

ఈ సినిమాలో బ్రాహ్మణ అమ్మాయి ఆరాధ్యగా సమంత కనిపిస్తారు. ఆమెను విజయ్ దేవరకొండ ప్రేమిస్తాడు. కానీ క్యాస్ట్ వేరు కావడంతో వీరి పేరెంట్స్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోరు. అయినప్పటికీ వీరిద్దరూ వారిని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. అప్పటి నుంచే అసలు కథ మొదలవుతుంది. పెళ్లి చేసుకున్న తరువాత వీరి జీవితం, వీరి మధ్య ఎదురైన సమస్యలు, వారు ఎలా పరిష్కరించుకున్నారు అన్న అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. వీరిద్దరి మధ్య వచ్చిన రొమాంటిక్ సన్నివేశాల గురించి ప్రస్తుతం నెట్టింట్లో చర్చ నడుస్తోంది.

నిజానికి ఇలాంటి సినిమాల్లో.. పెళ్లి అయిన తరువాత ఓ సాంగ్ రావడం, వారి మధ్య సాన్నిహిత్యాన్ని చూపించడం సర్వ సాధారణమే. ఏ సినిమాపై జరగని చర్చ “ఖుషి” సినిమాపై జరుగుతోంది. లిప్ లాక్ సీన్స్ ఎందుకు, అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్స్ మాత్రం ఇవి చాలా కామన్ గా ప్రతి సినిమాలో కనిపిస్తాయి కదా అని కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండకి గాని, సమంతకి గాని హేటర్స్ ఎక్కువే. వీరంతా కలిసి ఈ సినిమా మరింత నెగటివిటీ పెంచుతున్నారు అంటూ మరి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో క్లైమాక్స్ ఆకట్టుకుంటోంది అని టాక్ అయితే ఉంది.