Home Filmy Adda పరిస్థితి తెలియకుండా… “అల్లు అర్జున్” ని ఇంత ఘోరంగా ట్రోల్ చేయడం అవసరమా..?

పరిస్థితి తెలియకుండా… “అల్లు అర్జున్” ని ఇంత ఘోరంగా ట్రోల్ చేయడం అవసరమా..?

by Mohana Priya

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం ఇండస్ట్రీలలో కూడా అల్లు అర్జున్ చాలా ఫేమస్ అయిపోయారు. పాన్ ఇండియన్ హీరో అవ్వకముందు నుండే అల్లు అర్జున్ మలయాళం ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇప్పుడు అది ఇంకా పెరిగింది. దాంతో పుష్ప సెకండ్ పార్ట్ కోసం భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తోంది. సినిమా బృందం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో అల్లు అర్జున్ ఏం చేసినా కూడా ట్రెండింగ్ లో ఉంటోంది. అది కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, కొన్ని సార్లు మాత్రం నెగిటివ్ గా ఉంటోంది.

అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక విషయంపై ఇటీవల నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నిన్న జరిగిన సైమా అవార్డ్స్ లో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుచుకున్నారు. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ ఈ అవార్డ్ గెలుచుకున్నారు. నిన్న కృష్ణంరాజు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయంపై ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజు మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అల్లు అర్జున్ తనకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది అంటూ పోస్ట్ షేర్ చేశారు.

why netizens are trolling allu arjun without knowing the situation

దీంతో అల్లు అర్జున్ పై చాలా మంది, “అక్కడ ఆయన చనిపోయి ఉంటే ఈ పోస్ట్ చేయడం అవసరమా?” అంటూ కామెంట్స్ చేశారు. తర్వాత అల్లు అర్జున్ కృష్ణంరాజు గారి పార్థివ దేహాన్ని సందర్శించడానికి వచ్చారు. అప్పుడు అల్లు అర్జున్ ప్రభాస్ తో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దానిపై కూడా కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం అల్లు అర్జున్ ఆ ఫోటోల్లో నవ్వుతూ కనిపిస్తున్నారు. దాంతో, “అసలు అలాంటి చోట ఇలా చేయడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

why netizens are trolling allu arjun without knowing the situation

అయితే అల్లు అర్జున్ ఉన్న పరిస్థితి ఏంటో మనకి తెలియదు. అసలు ఎక్కడ ఏం జరిగింది అనే విషయం కూడా తెలియదు. కానీ ఒక ఫోటో చూసి ఒక వ్యక్తిని అంతగా ట్రోల్ చేయడం అవసరమా? అంతగా కామెంట్స్ చేయడం అవసరమా? ఇదే విషయాన్ని మాట్లాడుతూ, “అక్కడ పరిస్థితి తెలియకుండా అల్లు అర్జున్ పై ఇంత నెగిటివ్ గా ఎలా మాట్లాడుతారు?” అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

You may also like