క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా మన దగ్గర పెట్రోల్‌ ధరలు ఎందుకు తగ్గడం లేదు? కారణం ఇదే.!

క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా మన దగ్గర పెట్రోల్‌ ధరలు ఎందుకు తగ్గడం లేదు? కారణం ఇదే.!

by Megha Varna

Ads

పెట్రోల్ ,డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి ..అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్ ,డీజిల్ ధరలను మారుస్తూ ఉంటాయి .కాగా ధరలు ఒక రోజు పెరగొచ్చు ,ఇంకో రోజు తగ్గచ్చు..లేదా అదే రేట్ కొనసాగవచ్చు . అంతర్జాతీయంగా మార్కెట్ లో ముడి చమురు ధరలు గతంలో ఎప్పుడు లేని విధంగా పడిపోయాయి .ఏప్రిల్ 22 వ తేదీ నాటికీ ఓ బారెల్ దార కనిష్ట స్థాయికి 16 డాలర్లకు పడిపోయింది ..నెల రోజుల్లో చమురు ధరలు ఏకంగా 39 శాతం పడిపోయాయి .

Video Advertisement

ఈ నేపథ్యంలో భారత్ పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గక పోవడం గమనార్హం .కరోనా వైరస్ వలన అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు జనవరి నెల నుండి క్రమంగా తగ్గుతూ వచ్చాయి .అయినా ఇప్పటికి ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 76 .31 రూపాయలు ,డీజిల్ ధర 66 .21 రూపాయలు .అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గినా పెట్రోల్ ,డీజిల్ ధరలు భారత దేశంలో ఎందుకు తగ్గడం లేదు ..అసలు దానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ..

కేంద్ర ప్రభుత్వం  అనుకోని విధంగా మార్చ్ 14 వ తేదీన పెట్రోల్ ,డీజిల్ పై లీటరుకు మూడు రూపాయలు పెంచింది .దీనివలన కేంద్రానికి వచ్చే ఆదాయం 39 వేల కోట్ల రూపాయలు .ఆ తర్వాత వారానికి కేంద్ర ప్రభుత్వం భవిషత్తులో పెట్రోల్ ,డీజిల్ పై అదనంగా మరో ఎనిమిది రూపాయల ఎక్సైజ్   పన్నును పెంచేందుకు వీలుగా దేశ  ఆర్థిక బిల్లును మార్చింది .

చమురు ధరలు పెంచడం ,తగ్గించడం పై తమ ప్రభుత్త్వానికి ఎటువంటి సంబంధం లేదని చమురు ధరలపై నియంత్రణ ఎత్తివేసిన నాడే నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది .అప్పటి నుండి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే భారత్ లో కూడా తగ్గుతూ ,పెరిగినప్పుడు పెరుగుతూ వచ్చాయి.ఈ నేపథ్యంలో దేశ ఆర్ధిక పరిస్థితిని అభివృద్ధి చెయ్యడంలో భాగంగా చమురు ధరలపై ఎక్సైజ్  పన్నులను పెంచుతూ వచ్చింది ..

అసలు ఇంతలా పన్నులను పెంచడం దేశం యొక్క ఆర్థిక స్థితిని మెరుగు పరచాడనికే అని తెలుస్తుంది. ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవడానికి  ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది జీడీపీలో ఆదాయం, వినిమయానికి మధ్య తేడా మూడున్నర శాతానికి చేరుకుంది. ఈ వ్యత్యాసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏడు శాతానికి వెళ్తుందని ముంబైకి చెందిన ‘మోతీలాల్‌ ఓస్వాల్‌’ బ్రోకరేజ్‌ సంస్థ ఏప్రిల్‌ 13న విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది . మరోపక్క డాలర్‌తో రూపాయి మారక విలువ పడి పోతోంది. కరోనా పరిస్థితుల ప్రభావం ఇలాగే కొనసాగినట్లయితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ఆవకాశం ఉంది.


End of Article

You may also like