SALAAR: సలార్ సినిమాలో ప్రభాస్ అందుకే గొడ్డు కారం తింటాడా..? ఈ కారణం తెలుస్తే నవ్వాపుకోలేరు.!

SALAAR: సలార్ సినిమాలో ప్రభాస్ అందుకే గొడ్డు కారం తింటాడా..? ఈ కారణం తెలుస్తే నవ్వాపుకోలేరు.!

by kavitha

Ads

సలార్ సినిమా వచ్చిన దగ్గరనుంచి వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. సినిమా వచ్చి ఇన్ని రోజులైనాప్పటికీ ప్రభాస్ ఫాన్స్ ఇంకా ఆ మేనియా బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది ఈ సినిమా. పండగ టైమ్ వరకు ఈ సినిమాకి పోటీగా వచ్చే మరొక సినిమా లేకపోవడంతో ఈజీగా మరొక రెండు మూడు వందల కోట్లని వసూలు చేస్తుంది అంటున్నారు సినీ క్రిటిక్స్.

Video Advertisement

ఇక పెద్ద విషయానికి వస్తే దర్శకుడు హీరో పాత్రని చాలా బలమైన వ్యక్తిగా చూపించాడు.అదే సమయంలో తల్లి మాటకు విలువిచ్చే ఒక మంచి కొడుకుగా కూడా చిత్రీకరించాడు.

ఆ పాత్రలో ప్రభాస్ చాలా చక్కగా ఒదిగిపోయాడు. అమ్మకు ఇచ్చిన మాట కోసం తనలో ఉన్న ఆవేశాన్ని అణుచుకుంటూ గొడ్డుకారం తింటున్నా కోపమనేదే లేకుండా ఉండటాన్ని హీరో లో చూపిస్తాడు దర్శకుడు. అయితే నిజానికి హీరో సినిమా మొత్తంలో గొడ్డుకారం తింటున్నట్టు మాత్రమే చూపిస్తాడు దర్శకుడు. దీనికి కారణం ఏమిటి అనేది దర్శకుడు క్లారిటీ ఇవ్వలేదు అయితే ఒక తుంటరి నెటిజన్ దీనికి ఒక కామెడీ రీజన్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అది పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది. అదేమిటంటే సలార్ మూవీలో ప్రభాస్ ఎక్కువగా గుడ్డుకారంతోనే అన్నం తింటాడు.

వేరే కూరలతో అన్నం తిన్నట్లు మనకు ఎక్కడా కనిపించదు. వాళ్ళ ఇంట్లో ఏ కూర వండరా అనే ఒక ప్రశ్న ప్రేక్షకులకు తలెత్తి ఉండవచ్చు. అయితే ఒక చిన్న పాప ప్రభాస్ దగ్గరికి వచ్చి ఈరోజు నా బర్త్ డే కేక్ కట్ చేయు అని ప్రభాస్ చేతికి ఒక ప్లాస్టిక్ కత్తి ఇస్తుంది దానికి వాళ్ళ అమ్మ ఎంతో భయపడిపోయి ఆ కత్తి దేవా దగ్గర నుంచి తీసేసుకుంటుంది. అంటే చేతిలో ఆయుధం ఉంటే మళ్ళీ దేవా ఎవరినైనా చంపేస్తాడు అనే భయం ఆ తల్లిది.

అందుకే ఇంట్లో ఎలాంటి కత్తులు కత్తిపీటలు కొడవలు లేకుండా చేస్తుంది దాని వలన ఇంట్లో కాయగూరలు కొయ్యటానికి ఏమీ లేక వాళ్ళమ్మ ఏ కూర వండదు. దాంతో ప్రభాస్ రోజు గొడ్డు కారం తింటున్నాడు అంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు ఒక నెటిజన్. ఇప్పుడు ఈ ఫన్నీ రీజన్ తెగ ట్రేండింగ్ అవుతుంది ఇదేం కారణం రా అయ్యా అంటూ చాలామంది నెటిజెన్స్ కామెడీగా సెటైర్లు వేస్తున్నారు.


End of Article

You may also like