హనుమాన్ ఈవెంట్ కి హ్యాండ్ ఇచ్చిన ప్రభాస్.. ఎందుకు మాట తప్పాడో తెలుసా?

హనుమాన్ ఈవెంట్ కి హ్యాండ్ ఇచ్చిన ప్రభాస్.. ఎందుకు మాట తప్పాడో తెలుసా?

by Mounika Singaluri

Ads

సంక్రాంతి సినిమా సందర్భంగా విడుదలవుతున్న సినిమాలలో హనుమన్ సినిమా ఒకటి.తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా తీవ్ర పోటీ మధ్య విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఒకానొక సందర్భంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూ ఇస్తూ ప్రభాస్ అన్న మా సినిమా ప్రమోషన్స్ కి హాజరవుతారని మాటిచ్చారు అన్నాడు. అయితే అందరూ ఈ ఈవెంట్ లో ప్రభాస్ పాల్గొంటాడనే అనుకున్నారు.

Video Advertisement

అయితే ఈవెంట్లో ఎక్కడా ప్రభాస్ కనిపించకపోవడంతో అందరూ నిరాశకి గురయ్యారు. హాజరు కాకపోవడానికి కారణం ఏమిటా అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ఈ సినిమా కోసం ప్రభాస్ సీక్రెట్ మేకవర్ లో కనిపించబోతున్నాడు. అందుకుగాను తన హెయిర్ స్టైల్ ఇతర ఆహార్యం పూర్తిగా మార్చి వేయడం జరిగింది. కల్కి సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ప్రభాస్ బయట కార్యక్రమాలకు హాజరు కావద్దని దర్శకుడు నాగ్అశ్విన్ విజ్ఞప్తి చేశాడట.

అందుకే హనుమాన్ సినిమా ప్రమోషన్ లో పాల్గొనలేదు అని తెలుసుకున్న ప్రేక్షకులు ప్రభాస్ ఇచ్చిన మాట మేరకు హనుమాన్ సినిమా ను ఏదో ఒక విధంగా ప్రమోట్ చేస్తాడు అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా  ప్రి రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చిరంజీవి థియేటర్ లు దొరకక బాధపడుతున్న మూవీ టీం కి ధైర్యం చెబుతూ కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది అంటూ టీమ్ మెంబర్స్ లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో సింగిల్ స్క్రీన్స్ దొరకకపోయినా మల్టీప్లెక్స్ లలో మాత్రం భారీ సంఖ్యలో స్క్రీన్స్ దక్కాయి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం సంచలనాలు సృష్టించడం ఖాయం అంటున్నారు సినీ క్రిటిక్స్. భారీ సినిమాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా  భవిష్యత్తు జనవరి 12న తెలిసిపోతుంది.


End of Article

You may also like