ప్రతి ఎపిసోడ్ లో ఈ కంటెస్టెంట్ నే ఎందుకు హైలైట్ చేస్తున్నారు.? అంటే ఈసారి బిగ్‌బాస్ విన్నర్.?

ప్రతి ఎపిసోడ్ లో ఈ కంటెస్టెంట్ నే ఎందుకు హైలైట్ చేస్తున్నారు.? అంటే ఈసారి బిగ్‌బాస్ విన్నర్.?

by Mohana Priya

Ads

చూస్తుండగానే బిగ్‌ బాస్ తెలుగు 5 మొదలయ్యి నెల రోజులు గడిచింది. ఈ నెల రోజులలో కంటెస్టెంట్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వారు మాట్లాడే విధానం నుండి ప్రవర్తించే తీరు వరకు అన్ని మారాయి. కొంత మంది కంటెస్టెంట్స్ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయారు. మరికొంతమంది ఏమో ప్రేక్షకులకు ఇంకా దగ్గర అయ్యారు. మనం రోజు టీవీలో వీళ్ళని చూస్తూనే ఉంటాము. కానీ ఈ ప్రోగ్రాంలో వాళ్లు మనకు చాలా కొత్తగా కనిపిస్తారు.

Video Advertisement

ఆర్టిస్ట్ ప్రియని గత ఎన్నో సంవత్సరాల నుండి మనం సినిమాల్లో, సీరియల్స్ లో చూస్తూనే ఉంటాం. ప్రియ తెలియని తెలుగు వారు ఉండటం అరుదు. కానీ ఈ షోలో చూస్తూ ఉంటే ప్రియ కొత్తగా కనిపిస్తున్నారు. చాలా కూల్ గా తనదైన స్టైల్ లో గేమ్ ఆడుతున్నారు ప్రియ. ప్రతి టాస్క్ లో కూడా ఎక్కడా డైవర్ట్ అవ్వకుండా ఆడుతున్నారు. దాంతో ప్రియ ప్రతి ఎపిసోడ్ లో హైలైట్ గా నిలుస్తున్నారు. ప్రేక్షకుల్లో కూడా ప్రియకి చాలా మంది అభిమానులు ఉండడంతో, బిగ్ బాస్ కూడా ప్రియని హైలెట్ చేస్తున్నారు.

why priya is highlighted in bigg boss telugu 5

అయితే షో ఫాలో అవుతున్న వారందరికీ ఒక ఆలోచన మొదలైంది. ఈ సారి బిగ్ బాస్ విన్నర్ ప్రియా అవుతారు అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే వచ్చినప్పటినుంచి, ఇప్పటి వరకు కూడా ప్రియ అలాగే కూల్ గా ఉంటున్నారు. టాస్క్ పూర్తి చేయడం, అలాగే హౌస్ కి సంబంధించిన బాధ్యతలు కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఒక వేళ ప్రియ కానీ బిగ్ బాస్ విన్నర్ అయితే, తెలుగు బిగ్ బాస్ లో మొదటి మహిళ విజేతగా ప్రియ ఘనతను సంపాదించుకుంటారు.


End of Article

You may also like