డుప్లెసిస్, సామ్ కర్రన్ లు ఆరంజ్ , పర్పుల్ క్యాప్ లు ఎందుకు వేసుకోట్లేదు?

డుప్లెసిస్, సామ్ కర్రన్ లు ఆరంజ్ , పర్పుల్ క్యాప్ లు ఎందుకు వేసుకోట్లేదు?

by Mohana Priya

Ads

ఐపీఎల్ 2020 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ టీం కి ముంబై ఇండియన్స్ టీం కి మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా రాజస్థాన్ రాయల్స్ కి జరిగిన మ్యాచ్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

Video Advertisement

ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆడింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రమే. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్స్ ఫాఫ్ డు ప్లెసిస్ (130 పరుగులు) తో లీడింగ్ రన్ స్కోరర్ గా, సామ్ కుర్రాన్ (4 వికెట్లు) తో వికెట్ టేకర్ గా ఉన్నారు. కానీ వీళ్ళు ఆరెంజ్ ఇంకా పర్పుల్ క్యాప్ లను ధరించడం లేదు. దానికి కారణం ఏంటంటే.

ఐపిఎల్ రూల్స్ ప్రకారం లీడింగ్ రన్ స్కోరర్ ఆరెంజ్ క్యాప్ ని, అలాగే వికెట్ టేకర్ పర్పుల్ క్యాప్ ని ధరిస్తారు. కానీ అన్నీ జట్లు ఒక్కసారైనా మ్యాచ్ ఆడిన తర్వాత మాత్రమే ఈ క్యాప్ లను ధరించాలట. అంటే ప్రతి జట్టులోని ప్లేయర్ కి ఆడే అవకాశం వచ్చేంతవరకు క్యాప్ లను వేసుకోకూడదట. ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఐపీఎల్ 2020 లో మొదటిసారి ఆడబోతున్నారు. సెప్టెంబర్ 23 వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్ కి ఇంకా ముంబై ఇండియన్స్ కి మధ్య మ్యాచ్ జరగబోతోంది.


End of Article

You may also like